Meenakshi Chaudhary Pics: బాబోయ్.. మీనాక్షి చౌదరి! కిలాడీ భామ అందాలకు కుర్రకారు బోల్డ్
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే.. మీనాక్షి చౌదరి మైమరిపించే అందాలతో కుర్రాకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు. తాజాగా మీనాక్షి హాట్ ట్రీట్ ఇచ్చారు. హర్యానా బ్యూటీ అందాలకు కుర్రకారు ఫ్యూజులు ఔట్ అవుతున్నాయి.
సలార్, హిట్, కొలై సినిమాలలో కిలాడీ ఫేం మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలో ఆమె కీలక పాత్రలు చేస్తున్నట్లు సమాచారం.
రవితేజ హీరోగా వచ్చిన 'కిలాడీ' సినిమాలో మీనాక్షి చౌదరి నటించి పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో అందచందాలతో మీనాక్షి అందరినీ ఆకట్టుకున్నారు.
సుశాంత్ హీరోగా వచ్చిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే సినిమా ద్వారా మీనాక్షి చౌదరి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. మీను పాత్రలో అదరగొట్టారు.
మయన్మార్-యాంగోన్‌లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 అందాల పోటీలో మొదటి రన్నరప్ టైటిల్‌ను గెలుచుకున్న మీనాక్షి చౌదరి.. ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో మిస్ గ్రాండ్ కిరీటాన్ని కూడా అందుకున్నారు.
1997 మార్చి 5న హర్యానాలోని పంచ్‌కులాలో మీనాక్షి చౌదరి జన్మించారు. పంజాబ్లోని నేషనల్ డెంటల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో డెంటల్ సర్జరీ కోర్సు చేశారు.