Sai Dharam Tej: ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకున్న హీరోయిన్ తో సాయి ధరమ్ తేజ్ పెళ్లి.. ఎవరంటే..!

Sat, 19 Oct 2024-8:01 am,

పిల్ల నువ్వు లేని జీవితం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్. మొదటి సినిమాతోనే పరవాలేదు అనిపించుకున్న ఈ హీరోకి.. ఆ తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సుప్రీమ్ సినిమా మంచి విజయం అందజేసింది…  

ఇక ఆ తరువాత మాత్రం ఈ హీరోకి అనుకున్న స్థాయిలో విజయాలు రాలేదు. దానికి తోడు మధ్యలో యాక్సిడెంట్ కూడా కావడంతో.. చాలా రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు.

ఇక ఈ మధ్యనే విరూపాక్ష సినిమాతో మరోసారి విజయం అందుకున్నారు. ఈ క్రమంలో ఈ హీరో త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అన్న వార్త తెగ వైరల్ అవుతుంది ‌  

అది కూడా మరెవరితోనో కాదు.. తెలుగులో కొన్ని సూపర్ హిట్ సినిమాలలో నటించిన మెహరీన్ తో. మెహరీన్ 2022లో.. పొలిటీషియన్ భవ్య బిష్ణో తో ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పింది. 

ఈ క్రమంలో ఎప్పుడు ఈ హీరోయిన్ సాయి ధరంతేజ్ తో ప్రేమలో ఉందని.. వీరిద్దరి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.  

అంతేకాదు వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఈ సంవత్సరంలోనే ఉండొచ్చు అని కూడా వినికిడి. ఈ వార్తల్లో నిజమెంటో తెలియాలి అంటే.. వీరిద్దరిలో ఎవరో ఒకరు చెప్పే వరకు వేచి చూడాల్సిందే.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link