Mega Family: మెగా అభిమానుల్లో ఆందోళన.. ఒక హీరో పై మరొక హీరో పంజా..!
సాధారణంగా మెగా హీరోల నుంచి ఒక్క సినిమా వస్తోందంటే చాలు మెగా అభిమానుల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలుసు. అలాంటిది మెగా హీరోలు అందరూ కూడా క్యూ కడుతూ తమ సినిమాలను విడుదల చేస్తే, ఇక అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.. ఒకరకంగా చెప్పాలి అంటే మెగా అభిమానులకు అసలైన దసరా, దీపావళి పండుగలు మొదలయ్యాయని చెప్పడంలో సందేహం లేదు. వరుణ్ తేజ్ మొదలుకొని.. రాంచరణ్ వరకు ఇలా వరుసగా ఐదు మంది మెగా హీరోలు తమ సినిమాలను విడుదల చేయడానికి లైన్లో ఉంచారు. మరి ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతోందో ఇప్పుడు చూద్దాం..
వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లోపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజినీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం మట్కా మోస్ట్ హై బడ్జెట్ మూవీ గా వస్తున్న ఈ సినిమా నవంబర్ 14వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది. దాదాపు 24 సంవత్సరాల పాటు సాగే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాని డైరెక్టర్ ఎంచుకున్నారు.
ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా సీక్వెల్ డిసెంబర్ 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. భారీ అంచనాల మధ్య అల్లు అర్జున్ ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా విడుదల కాబోతోంది. అల్లు అర్జున్ మెగా హీరో కాకపోయినా.. మెగా కాంపౌండ్ హీరో అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం మెగా అల్లు ఫ్యామిలిల మధ్య వార్ నడుస్తున్న.. ఇప్పటికీ కొంతమంది మాత్రం మన బన్నీని మెగా ఫ్యామిలీలోనే చూస్తున్నారు.
ఇక ప్రముఖ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన విడుదల కాబోతోంది.
అలాగే మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం విశ్వంభర. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన విడుదల కాబోతోంది.
అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే యేడాది మార్చి 28వ తేదీన తన నుంచి హరిహర వీరమల్లు సినిమాను విడుదల చేయబోతున్నారు. మొత్తానికైతే ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలు కావడం గమనార్హం.
కథ ఇక్కడ వరకు బాగానే ఉన్నా.. ఇలా వరస పెట్టి బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయడంతో.. ఇవెక్కడ దిజాస్టర్ అవుతాయి అని కూడా కొంతమంది మెగా అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా పుష్ప, గేమ్ చేంజర్ విశ్వంభరా…. ఈ మూడు సినిమాలలో ఏవైనా రెండు సినిమాలు వెంట వెంటనే విడుదలయ్య చాన్స్ ఉన్నాయి. అలానే హరిహర వీరమల్లు విశ్వంభర కూడా.. గ్యాప్ లేకుండా విడుదలయ్యే ఛాన్స్ కనబడుతోంది. ఇలా గాని జరిగితే ఒక మెగా హీరో పై మరో మెగా హీరో పోటిపడటం ఖాయం. మరి చివరిగా వీరందరిలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.