Chiranjeevi Pics: స్నేహితుడి కుమారుడి పెళ్లిలో సందడి చేసిన చిరు, వెంకటేశ్, వైరల్ అవుతున్న ఫోటోలు

చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిదాగా ఉన్నారు. ఇక వెంకటేశ్ నటించిన సైంథవ్ ఇప్పటికే థియేటర్లలో నడుస్తోంది. త్వరలో రావిపూడి అనిల్‌తో మరో సినిమా తీయనున్నట్టు సమాచారం.

ఈ పెళ్లి ఫోటోల్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. తను ప్రియమిత్రుడి కుమారుడి పెళ్లికి హాజరవడం సంతోషంగా ఉందని చిరంజీవ్ షేర్ చేశారు. వెంకీ సైతం హాజరుకావడం సంతోషాన్ని రెట్టింపు చేసిందన్నారు.

కోనేరు కుమార్ ఒక ఎన్ఆర్ఐ. చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ ఇద్దరూ ఈయనకు స్నేహితులు. ఈ పెళ్లికి అల్లు అరవింద్, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్, టీజీ విశ్వప్రసాద్ హాజరయ్యారు.
చిరంజీవి తన ప్రాణ స్నేహితుడైన కోనేరు కుమార్ కుమారుడు కోనేరు కిరణ్, శైల్య శ్రీ వివాహానికి భార్యతో సహా హాజరయ్యారు. అటు విక్టరీ వెంకటేశ్ కూడా కుమార్తెతో కలిసి వచ్చారు.