Chiranjeevi: సమంతా షోలో మెగాస్టార్.. ‘ఆచార్య’ న్యూ స్టైల్ అదుర్స్
చిరంజీవి.. సమంతా సామ్‌జామ్ షోలో పాల్గొన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ఈ ఫొటోలను చూసిన అభిమానులు మెగాస్టార్ ఈ లుక్ ఆచార్య సినిమా కోసమేనంటూ తెగ సంబరపడిపోతున్నారు.
ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్య సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మెగాస్టార్ నయా స్టైల్‌లో కనిపించడంతో.. ఆచార్య సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఈ ఫొటోలను చూసిన అభిమానులంతా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.