Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ వేషంలో కనిపించిన ఈ సినిమా తెలుసా..!
Megastar chiranjeevi as Hanuman: అవును మెగాస్టార్ చిరంజీవిని భగవాన్ హనుమాన్ భక్తుడున్న సంగతి తెలిసిందే కదా. మెగా కుటుంబంలో ముందుగా శివ శంకర్ వరప్రసాద్ కాస్త చిరంజీవిగా మారారు.
ఇక తమ్ముడు కళ్యాణ్ బాబు కూడా సినిమాల్లో రాగానే తన పేరు ముందు ఆంజనేయ స్వామి పేరైన పవన్ పేరును చేర్చుకొని పవన్ కళ్యాణ్ అయ్యారు.అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ తిరుగులేని హీరో అయ్యారు. మన దేశంలో బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా పొలిటిషియన్ అవ్వడంలో హనుమంతుడి ఆశీర్వాదం ఉందనే అభిమానులు చెబుతుంటారు.
ఇక చిరంజీవి తన కుమారుడికి కూడా రామ్ చరణ్ అంటూ ఆ రాముడి చరణాలను కొలిచే భజరంగీ భళీ పేరు పెట్టారు. ఇక చిరంజీవి తల్లిగారి పేరు హనుమంతుడి తల్లి పేరు అయినా అంజనా దేవిగా ఉండటం యాదృచ్ఛికంగా కలిసొచ్చిన అంశమనే చెప్పాలి.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంతటి హనుమాన్ భక్తులైన కుటుంబం ఇంకొకటి లేదేమో. చిరంజీవి హనుమంతుడి పాత్ర పోషిస్తే బాగుంటుందని చెప్పారు. ఆన్ స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్‌లో కూడా వారి ఇమేజ్ సరితూగాలి. అందుకు చిరంజీవి పర్ఫెక్ట్ ఛాయిస్ అని అభిమానులు నమ్ముతూ ఉంటారు.
గతంలో చిరంజీవి .. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో ఓ సీన్ లో హనుమంతుడి వేషంలో కాసేపు అలా కనిపించారు. అందులో హనుమాన్ పాత్రతో ఓ ఫైట్ సీన్ కూడా ఉంటుంది. అటు ఈ సినిమాలో జై చిరంజీవా అంటూ రామ భక్త హనుమాన్ ను కీర్తిస్తూ ఓ పాట కూడా వుంది. అటు జై చిరంజీవా టైటిల్ తో చిరు ఓ సినిమా కూడా చేసారు.
అటు కొండవీటి దొంగ సినిమాలో శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం అంటూ ఓ పాట కూడా ఉంది. ముఠామేస్త్రీలో కూడా అంజనీ పుత్రుడా వీరాధివీరుడా అనే సాంగ్ కూడా ఉంది. ఈ రకంగా తన సినిమాల్లో సందర్భం వచ్చినపుడల్లా హనుమంతుడిపై తన భక్తి భావం చూపిస్తూనే వస్తున్నారు మెగాస్టార్.
చిరంజీవి సినిమాల విషయానికొస్తే..ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు సరసన త్రిష, మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది మే 9కు పోస్ట్ పోన్ అయింది.
విశ్వంభర తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నారు. దాంతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం.