Mehndi Colour: గోరింటాకు ఎర్రగా పండట్లేదా..?.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే కుంకుమ పువ్వులా ఎర్రగా మారుతుంది..
గొరింటాకు అమ్మాయిలకు ఎంత ఇష్టమో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. బర్త్ డే, పండగలు, శుభకార్యాలు ఇలా ఏది వచ్చిన కూడా తమ చేతులకు వయస్సుతో సంబంధం లేకుండా గొరింటాకు పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తారు.
కొందరిలో గోరింటాకు ఎర్రగా పండుతుంటే.. మరికొందరిలో మాత్రం.. అంత పండదు. ఈ నేపథ్యంలో.. దీంతో వాళ్లు తెగ బెంగ పెట్టుకుంటారు. తమచేతికి గోరింటాకు పండలేదని రచ్చ చేస్తుంటారు.
ఈ క్రమంలో చేతికి గోరింటాకు పెట్టుకున్న తర్వాత కొన్ని టిప్స్ పాటిస్తే మాత్రం మెహెందీ ఎర్రగా అవుతుందంట. చేతికి మెయిందీ పెట్టుకున్న తర్వాత.. ఒక గిన్నెలో చక్కెర తీసుకొవాలి. దానిలో నీళ్లు పోసి పదినిముషాలు ఉంచాలి.
ఆ తర్వాత ఒక దూదితో.. మన చేతికి ఉన్న మెయిందీకి ఈ చక్కెర నీళ్లను రెండు నుంచి మూడు సార్లు అప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత కొన్ని గంటల పాటు అలానే ఉంచాలి. ఆ తర్వాత కడుక్కుంటే చేతికున్న గోరింటాకు ఎర్రగా మారుతుంది.
మరో విషయం ఏంటంటే.. నిమ్మకాయను తీసుకుని దాని రసం ఒక గిన్నెలో తీసుకొవాలి. ఈ రసంను కూడా.. మెయిందీకి పెట్టుకున్న కూడా.. అలానే.. మెయిందీ ఎర్రగా మారుతుందంట. అచ్చం కుంకుమ పువ్వులా ఎర్రగా మారుతుందంట.