Melasma: కొబ్బరినూనె, పసుపుతో మ్యాజికల్ క్రీమ్‌.. ముఖంపై మంగు మచ్చలు వారంలో మాయం..!

Sun, 20 Oct 2024-9:26 pm,
Coconut and turmeric

కొబ్బరి నూనె పసుపు రెండిటితో కలిపి మంగు మచ్చలకు చెక్ పెట్టే రెమెడీ తయారు చేసుకుందాం. ఈ రెండిటిలో నయం చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి అంతేకాదు ఈ రెండు నిత్యం మన ఇంట్లో అందుబాటులో ఉంటాయి.  

Smooth paste

ఒక స్పూన్ పసుపు తీసుకొని అందులో రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేయాలి. ఈ రెండిటినీ కలిపి బాగా స్మూత్ పేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి.  

Melasma

ఈ పేస్టును మీ చేతి వేళ్లతో సాయంతో మంగు మచ్చలు ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. ఓ 20 నిమిషాల పాటు అలాగే ఉంచి గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేయాలి. ఈ ఫేస్ కి మాస్క్ ను వారానికి మూడుసార్లు అప్లై చేయడం వల్ల మెరుగైన ఫలితాలు లభిస్తాయి.  

అయితే కొంతమందికి పసుపు పడకపోవచ్చు. అందుకే ముందుగానే ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాతే మీ ముఖానికి ఉపయోగించండి. కొన్ని నివేదికల ప్రకారం ముఖ్యంగా NIH నివేదిక ప్రకారం పసుపులో కర్కూమిన్ ఉంటుంది ఇది పిగ్మెంటేషన్ సమస్యను సమర్థవంతంగా తగ్గిస్తుంది.  

పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి మంగు మచ్చలను తొందరగా తగ్గిస్తాయి. పిగ్మెంటేషన్ పూర్తిగా నివారిస్తాయి. అంతే కాదు కొబ్బరి నూనె వల్ల మీ ముఖం హైడ్రేటెడ్ గా ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link