Memes About India`s Name Change: ఇండియా పేరు మార్పు అంశంపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వైరల్
Memes About India's Name Change During G20 Summit: రాబోయే లోక్ సభ ఎన్నికలను గెలవడం కోసం కేంద్రం ఈ సెంటిమెంట్ ని రాజేస్తోంది అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇదే కోణంలోనూ మీమ్స్ దర్శనం ఇస్తున్నాయి.
Memes About India's Name Change During G20 Summit: ఇప్పటివరకు ఇండిగో ఎయిర్ లైన్స్ కంపెనీ పేరు ఇండిగో అని ఉండగా.. ఇక ఆ కంపెనీ కూడా తమ సంస్థ పేరు మార్చుకుని భాగో అని పిలవాల్సి ఉంటుంది అంటూ ఫన్నీగా మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.
Memes About India's Name Change During G20 Summit: ఇండియా పేరు మార్పు పరిణామాన్ని స్వాగతిస్తున్న వాళ్లు అందు వల్ల కలిగే లాభాలు ఏంటో వివరిస్తున్నారు. అలాగే ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లు సైతం వారి వాదన వెనుకున్న కారణాలను విశ్లేషిస్తున్నారు. మీమ్స్ రాయుళ్లు సైతం తమ సృజనాత్మకతకు పదునుపెట్టి మీమ్స్ రెడీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
Memes About India's Name Change During G20 Summit: ప్రముఖ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్, కాలమిస్ట్ మనోబాల విజయబాలన్ ఈ అంశంపై స్పందిస్తూ.. కమల్ హాసన్ నటించిన ఇండియన్ మూవీ సీక్వెల్ ఇండియన్ 2 పేరు మార్చి భారతన్ 2 అని పెట్టాల్సి వస్తుందేమో అంటూ ట్వీట్ చేశాడు. తమిళంలో భారతన్ అంటే తెలుగులో భారతీయుడు అనే అర్థం వస్తుంది అనే విషయం తెలిసిందే.
Memes About India's Name Change During G20 Summit: కేంద్రంలో ఎన్డీఏ సర్కారుతో విభేదిస్తున్న రాజకీయా పార్టీలన్నీ ఒక్క చోట చేరి I N D I A బ్లాక్ గా ఏర్పడిన నేపథ్యంలోనే తమ కూటమికి ఆ పేరు పెట్టుకున్న ప్రతిపక్షానికి చెక్ పెట్టడానికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది అని కొంతమంది వాదిస్తున్నారు.
Memes About India's Name Change During G20 Summit: ఇండియా పేరును భారత్ అని మార్పితే ఎలా ఉంటుంది అనే ప్రతిపాదనకు కొంతమంది మద్దతు ఇస్తుండగా.. ఇంకొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Memes About India's Name Change During G20 Summit: దీంతో ఇదే అదునుగా భావిస్తూ మీమ్స్ రాయుళ్లు సైతం తమ క్రియేటివిటీకి మరింత పదును పెట్టి ఇండియా పేరు మార్పు అంశాన్ని ఉపయోగించుకుంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
Memes About India's Name Change During G20 Summit: ప్రస్తుతానికి ప్రపంచ దేశాల వైఖరి సంగతి ఎలా ఉన్నా.. ఇండియాలో మాత్రం ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్ అయి కూర్చుంది.