Menthikura Pappu: మెంతికూర పప్పు ఇలా చేస్తే.. మెతుకు మిగుల్చకుండా తింటారు..
కావాల్సిన పదార్థాలు.. తాజా మెంతికూర-2 శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి, కందిపప్పు -200 గ్రాములు తీసుకుని స్టవ్ ఆన్ చేసి ఓ గిన్నెలో వేసుకోవాలి. అందులో కొద్దిగా పుసుపు, నూనె వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
మరోవైపు నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయ సన్న తరగాలి. టమోటా, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు సగం ఉడికిన పప్పులో ఉల్లిపాయలు వేసుకోవాలి. టమోటాలు, వెల్లల్లి, జిలకర్ర వేసి మూత పెట్టుకోవాలి.
పప్పు 80 శాతం ఉడికిన తర్వాత మెంతి కూర వేసుకోవాలి. దీంతో బీపీ, షుగర్ కంట్రోల్ ఉంటుంది. ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక చెంచా కారం వేసుకుని బాగా కలపాలి.
ఓ ఐదు నిమిషాలు పప్పు బాగా ఉడికిన తర్వాత చింతపండు రసం, కొత్తిమీర కూడా వేసుకని బాగా కలపాలి. ఇప్పుడు పప్పును మెత్తగా రుబ్బుకోవాలి.
ఇప్పుడు తాలింపునకు నూనె కడాయిలో వేసి ఆవాలు, జిలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు కూడా వేసి తాలింపు వేయాలి. దీన్ని పప్పులో వేసుకుంటే రుచికరమైన మెంతికూర పప్పు రెడీ.