Mercury Transit 2024: ఈ 5 రాశుల ప్రజలు 23 రోజుల్లో కోటీశ్వరులు కానున్నారా
మిధున రాశి
ఈ రాశి ప్రజలకు ఇది చాలా అనువైన సమయం. ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న పనులు పూర్తి కాగలవు. చేపట్టిన పనులు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారులకు అదృష్టం కలిసి వస్తుంది. ఇంట్లో ఆనందం ఉంటుంది. ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది. కష్టాలు తీరుతాయి.
వృషభ రాశి
వ్యాపారులకు చాలా మంచి సమయం. ధనలాభం ఉంటుంది. ఇతరులతో ఆలోచించి ఏ పనైనా చేయాల్సి ఉంటుంది. ఉద్యోగం చేసేచోట కీలకమైన బాధ్యతలు ఉంటాయి. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. ఉద్యోగులు, వ్యాపారులకు అనువైన సమయం.
మేష రాశి
ఈ రాశి ప్రజలు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం పెంచుకునేందుకు కొత్త ఐడియాలు లభిస్తాయి. కానీ డబ్బులు అధికంగా ఖర్చవుతాయి. స్కిన్ కేర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే చర్మ సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు. ఆర్ధికపరంగా ఇబ్బందులు ఎదురుకావచ్చు. కానీ కొన్ని సూచనలు పాటిస్తే కచ్చితంగా కోటీశ్వరులౌతారు
సింహ రాశి
రుణాలు చేతికి అందేందుకు ఇది సరైన సమయం. ధనలాభం ఉండవచ్చు. వ్యాపారులు, ఉద్యోగులకు చాలా బాగుంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఆర్దికంగా లాభపడతారు.
కర్కాటక రాశి
ఈ రాశి వ్యక్తులకు ఇది కాస్త కష్ట సమయమే. వివాదాలు పెరగవచ్చు. ఉద్యోగులు, వ్యాపారులకు ఇబ్బందులు ఎదురౌతాయి. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వివాదాస్పద అంశాల్లో జోక్యం చేసుకోకూడదు. ఎప్పట్నించో రావనుకున్న డబ్బులు చేతికి అందుతాయి