Milk Health Benefits: ప్రతిరోజు పాలు తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు..
పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజాలు ఉన్నాయి. రోజుకో గ్లాసు పాలు తాగితే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
పాలలో కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్ డి, విటమిన్ ఎ, బి1, బి2, బి12 వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవి ఎముకలు బలపడటానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి, జీర్ణక్రియ సాఫీగా అవ్వడానికి సహాయపడుతాయి.
పాలలోని అమైనో యాసిడ్స్ శరీర పోషణకు, కణాలు, కణజాలాలు బాగుపడటానికి సహాయపడతాయి.
కొంతమంది పచ్చిమిర్చి కలుపుకుని పాలు తాగుతారు. ఇలా చేయడం వల్ల జలుబు, వంటి సమస్యలు దూరమవుతాయని నమ్మకం.