Milk Tea Side Effects: మిల్క్ టీతో కలిగే ఈ 9 దుష్పరిణామాలు తెలిస్తే ఎప్పుడూ తాగరిక
నిద్రలేమి సమస్య
మిల్క్ టీలో ఉండే కెఫీన్ కారణంగా నిద్ర పాడవుతుది. రోజూ సాయంత్రం టీ తాగే అలవాటుండేవారికి నిద్ర సమస్యగా మారుతుంది
బరువు పెరగడం
రోజూ మిల్క్ టీ తాగే అలవాటు ఉంటే బరువు కూడా పెరిగే ప్రమాదం లేకపోలేదు. ప్రత్యేకించి బరువు తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నవారికి మిల్క్ టీ మంచిది కాదు.
నీటి కొరత, తలనొప్పి
మిల్క్ టీ తాగడం వల్ల శరీరంలో డీహ్రైడ్రేషన్ సమస్య రావచ్చు. అంతేకాకుండా తలనొప్పి సమస్య ఉంటుంది
గుండె వ్యాధులు
మిల్క్ టీ అధికంగా తాగే అలవాటుంటే గుండె వ్యాధులు ముప్పు పెరుగుతుంది.
ఎసిడిటీ, మలబద్ధకం
మిల్క్ టీ అదే పనిగా తాగడం వల్ల మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. కడుపులో బ్లోటింగ్ సమస్య ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ రావచ్చు
పింపుల్స్
మిల్క్ టీ అధికంగా తీసుకునే అలవాటుంటే చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ముఖంపై పింపుల్స్ వస్తాయి. చర్మంపై నిగారింపు పోతుంది
పళ్లపై ప్రభావం
మిల్క్ టీ ఎక్కువగా తాగడం వల్ల పళ్లు బలహీనంగా మారుతాయి. పంచదార పళ్లలో చేరుకుని హాని కలిగిస్తుంది
ఎముకలపై ప్రభావం
పాలలో కాల్షియం ఉంటుంది కానీ మిల్క్ టీలో కెఫీన్, ట్యానిన్ కారణంగా శరీరంలో కాల్షియం సంగ్రహణ ఆగిపోతుంది. దాంతో ఎముకలు బలహీనంగా మారతాయి
టీ ప్రత్యామ్నాయం లేదా
టీ ప్రేమికులకు టీ లేకుండా ఉండలేరు. రోజూ పలు సార్లు మిల్క్ టీ తాగే అలవాటుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కలుగుతుందని తెలుసుకోవాలి. దీనివల్ల చాలా నష్టాలున్నాయి.