Tamannaah Bhatia Pics: అసలే మిల్కి బ్యూటీ.. అందులోనూ వైట్ డ్రెస్! తమన్నా భాటియా అందం వేరే లెవల్
తమన్నా 15 ఏళ్ల క్రితం సినిమాల్లోకి వచ్చినప్పడు ఎలా ఉన్నారో ఇప్పటికే అదే ఫిజిక్ మైంటైన్ చేస్తున్నారు. ముఖ్యంగా తమన్నా నడుముకు చాలా మంది ఫాన్స్ ఉన్నారు.
ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, తమిళంలో తమన్నా సినిమాలు చేస్తున్నారు. గుర్తుందా శీతాకాలంతో ప్రేక్షకుల ముందుగా వచ్చిన మిల్కీబ్యూటీ.. చిరంజీవికి జోడిగా 'భోళా శంకర్' సినిమాలో నటిస్తున్నారు.
కెరీర్ మాంచి ఊపు ఉన్నప్పుడే ఐటమ్ సాంగ్స్ చేసిన తమన్నా అందరినీ ఆచార్య పరిచారు . రంగం, బాద్షా, అల్లుడు శీను, జై లవకుశ, సరిలేరు నీకెవ్వరూ, కేజీఎఫ్, గనితో పాటు పలు తమిళ, కన్నడ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేశారు.
2007లో వచ్చిన 'హ్యాపీడేస్' సినిమాతో తమన్నా మంచి గుర్తింపు తెచుకున్నారు. తడాకా, 100% లవ్, ఆగడు, ఎందుకంటే ప్రేమంట, ఊపిరి, రచ్చ, బద్రీనాథ్, బెంగాల్ టైగర్, బాహుబలి, ఎఫ్ 2లతో స్టార్ అయ్యారు.
హిందీ సినిమా 'చాంద్ సా రోషన్ చెహ్రా'తో వెండి తెరకు పరిచయం అయిన తమన్నా.. 2005లో 'శ్రీ' సినిమాతో తెలుగులో, 2006లో 'కేడీ'తో తమిళంలోకి అడుగుపెట్టారు.
1989 డిసెంబరు 21న ముంబైలో తమన్నా భాటియా జన్మించారు. తమన్నాది సింధీ కుటుంబం. చిన్నప్పట్నుంచి హీరోయిన్ కావాలనుకునే తమన్నాకి తల్లిదండ్రులు అండగా నిలిచారు.