Ola IPO: ఓలా ఐపీవోలో మినిమం ఎన్ని షేర్లు కొనాలి? ఎంత ఇన్వెస్ట్ చేయాలి? రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టవచ్చా.?
Ola: భారత్ లోని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు కంపెనీ అయిన ఓలా..ఎలక్ట్రిక్ ఐపీఓకు రెడీ అయ్యింది. తాజా ఐపీవోకు చెందిన ప్రైస్ బ్యాండ్ ప్రకటించింది. ఆగస్టు 2వ తేదీ నుంచి ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తెరచుకోనుంది. ఓలా ఐపీవోలో మినిమం ఎన్ని షేర్లు కొనాలి?ఎంత పెట్టుబడి పెట్టాలి? రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టవచ్చా? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Ola Electric IPO: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ ఓలా.. ఎలక్ట్రిక్ IPOకు సర్వం సిద్ధమైంది. తాజాగా ఐపీవోకు సంబంధించిన ప్రైస్ బ్యాండ్ కూడా కంపెనీ ప్రకటించింది. OLA ఎలక్ట్రిక్ IPO ప్రైస్ బ్యాండ్ రూ.72 నుండి రూ.76గా నిర్ణయించారు. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ IPO శుక్రవారం ఆగస్టు 2న తెరుచుకోనుంది. ఇన్వెస్టర్లు ఆగస్టు 6 వరకు బిడ్లు దాఖలు చేయవచ్చు.
అయితే కంపెనీ 195 షేర్లను ఒక లాట్ గా నిర్ణయించింది. ప్రైజ్ బ్యాండ్ లో ఎగువ ధరల బ్యాండ్‌ను పరిశీలిస్తే, ఓలా ఎలక్ట్రిక్ లాభాలలో భాగస్వామి కావడానికి, మీరు కనీసం ఒక లాట్‌కి వేలం వేయాలి. ఇందు కోసం మినిమం మీరు రూ. 14,820 ఇన్వెస్ట్ పెట్టాలి.
Ola Electric IPO పరిమాణం గురించి చెప్పాలంటే, కంపెనీ ఇష్యూ ద్వారా మార్కెట్ నుండి మొత్తం 6,145.56 కోట్ల రూపాయలను సమీకరించనుంది. దీని కింద మొత్తం 808,626,207 షేర్లను విక్రయానికి ఉంచనున్నారు.
ఓలా ఐపీవో తాజా ఇష్యూ ప్రకారం రూ. 10 ముఖ విలువ కలిగిన 723,684,210 కొత్త షేర్లు జారీ చేయనున్నారు. వాటి మొత్తం విలువ రూ.5,500 కోట్లు. మరోవైపు, ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా రూ. 645.56 కోట్ల విలువైన 84,941,997 షేర్లకు బిడ్లు ఆహ్వానించారు.
షేర్లు ఎప్పుడు లిస్ట్ అవుతాయి: ఓలా ఎలక్ట్రిక్ అనేది మొబిలిటీ EV కంపెనీ. దీనిని 2017లో బెంగళూరులో భవిష్ అగర్వాల్ స్థాపించారు. ఆగస్ట్ 2 నుండి 6 వరకు బిడ్‌లను స్వీకరించిన తర్వాత, కంపెనీ షేర్ల కేటాయింపు ఆగస్టు 7న జరుగుతుంది. అయితే బిడ్డింగ్ ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాలలోని షేర్ క్రెడిట్ ఆగస్టు 8న జరుగుతుంది. స్టాక్ ఎక్స్ఛేంజీలు BSE NSE రెండింటిలో లిస్టింగ్ చేయడానికి కంపెనీ ఆగస్టు 9న జరుగుతుంది.
ఈ ఐపీవోకు, కోటక్ మహీంద్రా క్యాపిటల్, గోల్డ్‌మన్ సాక్స్, యాక్సిస్ క్యాపిటల్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, బోఫా సెక్యూరిటీస్, సిటీ గ్రూప్, బిఒబి క్యాప్స్, ఎస్‌బిఐ క్యాప్స్ లీడ్ బ్యాంకర్లుగా ఉన్నాయి.
ఓలా ఐపీవోలో ఇన్వెస్ట్ చేయవచ్చా..వద్దా..? దేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఓలా ఒక ప్రధాన శక్తిగా ఎదుగుతోంది. భారత్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్ గా ఎదిగింది. దీంతో ఈ వెహికిల్స్ మార్కెట్ సైజ్ రూ. 7.20 లక్షల కోట్ల నుండి రూ. 8.00 లక్షల కోట్ల మధ్యలో ఉంది.
అంతేకాదు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, సౌత్ ఈస్ట్ ఆసియా వంటి మార్కెట్లకు సైతం ఓలా విస్తరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓలా ఐపీఓ గ్రే మార్కెట్లో కూడా పాజిటివ్ సంకేతాలను అందిస్తోంది. ఓలా ప్రస్తుతం గ్రే మార్కెట్లో 12 రూపాయల ప్రీమియం వద్ద ట్రేడవుతోంది.
Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.