ITR Filing: ITR ఫైలింగ్..ఇంకో వారం రోజులే సమయం..డెడ్ లైన్ మిస్సయ్యిందో..7ఏళ్ల జైలు శిక్ష తప్పదు

Mon, 23 Dec 2024-8:27 pm,
ITR Filing:

ITR Filing: గత ఆర్థిక ఏడాది 2023-24కు సంబంధించి ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు గడువు 31తో ముగిసింది. అయితే ఈ గడువు లోపు ఫైల్ చేయనివారికి ఏవైనా తప్పులు సవరించుకునేందుకు డిసెంబర్ 31వ తేదీ వరకు 2024 వరకు ఛాన్స్ ఉంటుంది. దీనినే బిలేటెడ్ ఐటీఆర్ లేదా రివైజ్డ్ ఐటీఆర్ అంటారు. నామమాత్రపు జరిమానాలు, బకాయిలపై వడ్డీ చెల్లించి ఐటీఆర్ దాఖలు చేసుకోవచ్చు. మరి ఈ డిసెంబర్ గడువు కూడా మిస్సయితే ఎలా. ఎలాంటి సమస్యలు వస్తాయో ఓసారి చూద్దాం. 

Billed ITR file

బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేసేందుకు డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు ఉంది. రూ. 5లక్షల లోపు పన్ను ఆదాయం ఉన్నవారు రూ. 1000 ఆపై ఆదాయం ఉంటే రూ. 5వేల జరిమానా కట్టాల్సి ఉంటుంది. అలాగే బకాయిలపై ఆదాయపు పన్ను చట్టం 1981లో పలు  234 సెక్షన్ల కింద వడ్డీ పడుతుంది. డిసెంబర్ 31 గడువు సైతం మిస్సయితే చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. 

Retirement file with special permission

ఈ గడువు తర్వాత ప్రత్యేక అనుమతితో రిటైర్న్స్ ఫైల్ చేసినా రీఫండ్ రాదు. అంటే మీరు ట్యాక్స్ చెల్లిస్తున్నారని చెప్పేందుకు ఇది ఉపయోగపడుతుంది. రీఫండ్ కోల్పోవడంతోపాటు పెనాల్టీలు, జరిమానాలు కూడా చెల్లించాల్సి వస్తుంది.   

లేట్ రిటర్న్స్ దాఖలు చేస్తే కొత్త పన్ను విధానం మాత్రమే ఎంచుకోవాలి. దీంతో ట్యాక్స్ మినహాయింపులు క్లెయిమ్ చేసుకోలేరు. న్యూ ట్యాక్స్ పేయర్  విధానంలో ఆదాయపన్ను పత్రాలను సమర్పించాల్సి రావడం వల్ల ట్యాక్స్ పేయర్ ఈ ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది.   

మీరు డిసెంబర్ 31, 2024 లోపు బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయనట్లయితే ఆదాయపు పన్ను విభాగం చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రెడీగా ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 276 సిసి కింద చర్యలు తీసుకుంటుంది. ప్రత్యేక కేసుల్లో కావాలని రిటర్న్స్ ఫైల్ చేయకుండా ఉన్నవారికి 7ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఆలస్యంగా ఫైల్ చేసినందుకు జరిమానాలు, వడ్డీతోపాటు చట్టపరమైన చర్యలు, మానీటరీ ఫైన్స్ కూడా ఉంటాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link