Kinjarapu rammohan naidu: తండ్రికి తగ్గ కొడుకు.. 26 ఏళ్ల వయస్సులో ఎంపీ.. యంగెస్ట్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేకతలు ఇవే..

Sun, 09 Jun 2024-4:56 pm,

దేశంలో మోదీ మిత్రపక్షాల మద్దతుతో ఈరోజు సాయంత్రం మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ఈ ఆకార్యక్రమానికి ఇప్పటికే పలు దేశాధినేతలకు ఆహ్వనం వెళ్లింది. వీరితో మన దేశంలోని రాజకీయ రంగం ప్రముఖులు, ముఖ్య నేతలు, పలు రాష్ట్రాల సీఎంలు, అపోసిషన్ నేతలు, గవర్నర్ లకు అందరికి మోదీ ప్రత్యేకంగా వెల్ కమ్ చెప్పినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఏపీ నుంచి మోదీ 3.0 మంత్రి వర్గంలో చోటు కన్ఫామ్ చేసుకున్న శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెడింగ్ లో నిలిచారు. ఆయన మూడోసారి ఎంపీగా శ్రీకాకుళం నుంచి గెలిచి, హ్యట్రిక్ పీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కేంద్ర మంత్రి వర్గంలో చోటు సంపాదించారు.

రామ్ మోహన్ 1987 డిసెంబర్ 18న శ్రీకాకుళంలోని నిమ్మాడలో జన్మించారు. తండ్రి రాజకీయ నైపుణ్యాలను వారసత్వంగా పొందారని చెప్పవచ్చు. కింజరపు రామ్మోహన్ నాయుడు.. తండ్రి కూడా గతంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు సహకారంతో  ఎర్రన్నాయుడు గతంలో కేంద్రమంత్రి అయ్యారు. 

ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యి తండ్రి లేని లోటును రామ్మోహన్ నాయుడు తీర్చారు. గతంలో.. ఎర్రన్నాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉండి రాష్ట్రానికి అనేకవిధాలుగా సేవలు అందించారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు సైతం... తండ్రికి తగ్గ కొడుకులా.. దేశానికి అదే విధంగా సేవలు చేస్తారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రామ్మోహన్ నాయుడు అచ్చం తండ్రి లాగా కుంకుమ పెట్టుకుని ఎప్పుడు ఆయన మాదిరిగానే ప్రజలకు మంచి చేయాలని పరితపిస్తుంటారు.

రామ్మోహన్ నాయుడు మూడు భాషల్లో కూడా స్పష్టంగా మాట్లాడగలరు. ఏపీ కోసం, ప్రజల కోసం ఎంతో కష్టపడుతానని, ఏపీని అన్ని రంగాల్లో ముందుకు వెళ్లేలా చేస్తామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. కేంద్రం సపోర్ట్ తో ఏపీని డెవలప్ చేస్తామని అన్నారు.

దేశంలో యంగేస్ట్ కేంద్ర మంత్రిగా టీడీపీ సిక్కొలు బిడ్డ రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎంబీఏ చదవిన ఆయన.. మూడు భాష్లల్లో తెలుగు, హింది, ఇంగ్లీష్ లోను అనర్గళంగా మాట్లాడగలరు. మూడు సార్లు ఎంపీగా కూడా గెలిచారు. అంతేకాకుండా ఆయన 26 ఏళ్ల వయసుల్లోనే ఎంపీగా గెలిచారు.

ఉన్నత చదువుల కోసం సింగపూర్ వెళ్లిన రామ్మోహన్ నాయుడు, అనూహ్యంగా ఆయన తండ్రి ఎర్రనాయుడు 2012 లో రోడ్డు ప్రమాదంలో చనిపోవడం వల్ల తిరిగి వచ్చేశారు.  అప్పటి నుంచి టీడీపీ తరపును, ఏపీ ప్రజల కోసం తనవంతుగా పాటు పడ్డారు.

తండ్రి ఎర్రనాయుడు మాదిరిగానే.. రామ్మోహన్ నాయుడు కూడా టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత విధేయుడిలా ఉండేవాడు.  చంద్రబాబు అరెస్ట్ అయిన క్రమంలో.. రామ్మోహన్ నాయుడు కీలక పాత్ర పోషించారు.  రామ్ మోహన్ ను 2020 లో సంసద్ రత్న అవార్డుతో సత్కరించారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link