Central government schemes: మోదీ సర్కార్ ఇస్తున్న ఈ స్కీం ద్వారా లక్షల్లో ఆదాయం..ఇలా పొందండి..!!

Fri, 02 Aug 2024-8:28 pm,

PM schemes: మీరు కనుక ఉన్న గ్రామంలోనే మంచి ఆదాయం పొందే మార్గం కావాలి అనుకున్నట్లయితే, వ్యవసాయ  అనుబంధ రంగాల్లో ఉన్న అవకాశాలను వాడుకోవచ్చు. అందులో భాగంగా ప్రస్తుతం తేనెటీగల పెంపకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తేనెటీగల పెంపకం వల్ల రైతులు పెద్ద ఎత్తున ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా ఆత్మ నిర్భయ భారత్ లో భాగంగా తేనెటీగల పెంపకానికి అత్యధిక ప్రాధాన్యత అందించింది. ఇందులో భాగంగా తేనె ఉత్పత్తిలో అటు రైతులతో పాటు స్టార్టప్స్, అగ్రికల్చరల్ ఎంటర్ ప్రెన్యూస్, దీంతోపాటు ఎగుమతి దారులు మీరందరితో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఒక సిస్టం ఏర్పాటు చేసింది. అలాగే తేనెటీగల పెంపకానికి సంబంధించి రైతులకు శిక్షణ అందించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది.

శిక్షణ ఎక్కడ అందిస్తారు: హైదరాబాదులోని గ్రామీణ అభివృద్ధి సంస్థ తేనెటీగల పెంపకం పట్ల శిక్షణ అందిస్తోంది. అలాగే తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు కూడా తేనెటీగల పెంపకం పైన ప్రత్యేకమైన శిక్షణ తరగతులు అవగాహన తరగతులు రైతుల కోసం ఏర్పాటు చేస్తున్నారు.   

తేనెకు ఉన్న మార్కెట్ ఇదే: తేనెకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉంది ఎందుకంటే వైద్యులు పంచదార కన్నా కూడా తేనెను తీపి కోసం వాడమని సూచిస్తున్నారు. పంచదార తయారీలో ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ వాడుతుంటారని. దానికి బదులుగా సహజమైన తీపి గుణం ఉన్న తేనెను వాడితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తేనెకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. దీన్ని మీరు ఒక అవకాశం గా మార్చుకున్నట్లయితే ఉన్న గ్రామంలోని మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.   

తేనెటీగల పెంపకం కోసం మీ పొలంలోనే కొంచెం స్థలం ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. తేనెటీగలను బాక్సుల్లో పెంచుతారు వీటి నుంచే తేనెను సేకరించవచ్చు. తేనెటీగలను పెంచడం ద్వారా వ్యవసాయం కూడా ఉత్పత్తి పెరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా పండ్ల తోటలు పూల మొక్కలు వ్యవసాయం చేసేవారు తేనెటీగల పెంపకం చేపట్టినట్లయితే వారి ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తేనెటీగల పెంపకం కోసం నాబార్డు సైతం రుణాలను అందిస్తోంది అలాగే ముద్రా రుణాలను తీసుకొని కూడా మీరు ఈ తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించవచ్చు.  

కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం వ్యవసాయదారులకు ఆదాయాన్ని రెండింతలు చేసేందుకు అనేక ప్రణాళికలు సిద్ధం చేసింది ఇందులో భాగంగా వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా ఉపాధి అవకాశాలను పెంచేందుకు అనేక ప్రోత్సాహకాలు ప్రకటించింది ఇందులో భాగంగా ప్రస్తుతం రైతులు ఔత్సాహిక యువ వ్యాపారులు ఎవరైనా తేనెటీగల పెంపకం గురించి తెలుసుకోవాలి అనుకుంటే అందుకు సంబంధించిన శిక్షణ ఎక్కడ ఇస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link