Siraj, Zanai Love: ఆమె నా లవర్ కాదు.. చెల్లెలు లాంటిది: రూమర్లపై బాంబ్‌ పేల్చిన సిరాజ్

Mon, 27 Jan 2025-2:12 pm,
Mohammed Siraj Relation With Zanai Bhosle 1

భారత క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌ క్రికెట్‌లో చెలరేగుతున్నాడు. ప్రస్తుతం బౌలింగ్‌లో సిరాజ్‌ కొంత తడబడుతున్నాడు. ప్రదర్శన చేయలేకపోవడంతో జట్టులో చోటు కోల్పోతున్నాడు. 

Mohammed Siraj Relation With Zanai Bhosle 3

తెలంగాణకు చెందిన మహ్మద్‌ సిరాజ్‌ తాజాగా ఓ యువతితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఒక ఫొటో ఒక్కసారిగా నెట్టింట్లో హల్‌చల్‌ చేసింది. ఆమెతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని చర్చ జరిగింది.

Mohammed Siraj Relation With Zanai Bhosle 5

ప్రముఖ గాయని ఆశా బోస్లే మనవరాలు జనై భోస్లేతో మహ్మద్‌ సిరాజ్‌ దిగిన ఫొటో ఈ ప్రచారానికి ఊపిరి పోసింది. వీరిద్దరూ కొంత క్లోజ్‌గా ఉండడంతో జనైతో ఆమె ప్రేమలో ఉన్నాడని ప్రచారం జరిగింది.

ఈ వార్తల నేపథ్యంలో సిరాజ్‌ వెంటనే స్పందించాడు. 'జనై నాకు ప్రేయసి కాదు. ఆమె నాకు చెల్లెలు వరుసలాంటిది' అని చెప్పి సిరాజ్‌ కుండబద్దలు కొట్టాడు. 

'ఆమెలాంటి చెల్లెలు నాకు ఎవరూ లేరు. ఆమె లేకుండా నేను ఎక్కడా ఉండాలనుకోను. నక్షత్రాలతో చంద్రుడు ఉన్నట్లే.. ఆమె వెయ్యి మందిలో ఒకరు' అనే కవితను మహ్మద్‌ సిరాజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పెట్టుకున్నాడు.

ఈ పుకార్లపై జనై భోస్లే కూడా స్పందిస్తూ.. 'సిరాజ్‌ తనకు ప్రియమైన సోదరుడు' అని తన ఇన్‌స్టా స్టోరీలో పోస్టు చేసింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link