Mohan Babu Family Controversy: మోహన్ బాబు జల్‌పల్లి ఫాంహౌజ్ పిక్స్ చూశారా.. రాజభవనాన్ని తలదన్నేలా..!

Wed, 11 Dec 2024-12:00 pm,

మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. జల్‌పల్లి ఫామ్‌హౌస్‌ నుంచి మనోజ్‌ను మోహన్ బాబుకు బయటకు పంపించేయడంతో మంగళవారం అంతా అక్కడ హైడ్రామా నడిచింది.  

అక్కడ కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు అనుచరులు దురుసుగా ప్రవర్తించడం.. ఓ ఛానెల్ లోగోను తీసుకుని మోహన్ బాబు దాడికి పాల్పడడం కలకలం రేపింది.  

కెమెరాల లాక్కుని.. ఫామ్‌హౌజ్‌లోకి లోపలికి వచ్చిన మీడియా సిబ్బందిని తన బౌన్సర్లతో బయటకు తోయించేశారు.   

ఈ క్రమంలో హైబీపీతో మోహన్ బాబు మంగళవారం రాత్రి కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.   

అంతకు ముందు  మంచు మనోజ్, మౌనిక దంపతులు మోహన్ బాబు నివాసానికి చేరుకోగా.. వారిని లోపలికి రానివ్వలేదు. లోపల తన కూతురు ఉందని గేట్లు తీయాలంటూ సెక్యూరిటీని బెదిరించారు.   

వాళ్లు ఎంతకూ గేట్లు తీయకపోవటంతో తన బౌన్సర్లతో కలిసి గేటును తోసుకుని లోపలికి దూసుకెళ్లారు. లోపల మనోజ్‌కు, మోహన్ బాబుకు తోపులాట జరగ్గా.. మోహన్ బాబు ఫ్రస్టేషన్‌లో మీడియాపై దురుసుగా ప్రవర్తించారు.  

మోహన్ బాబు దాడి ఘటనపై జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన చేపట్టాయి. మోహన్ బాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link