Money Saving Tips: డబ్బు పొదుపు చేసే మార్గాలు.. ఇలా చేస్తే మీ భవిష్యత్‌కు భరోసా

Sat, 07 Jan 2023-8:48 pm,

ఎవరైనా డబ్బు సంపాదించవచ్చు. కానీ ఆ ఆదాయం నుంచి ఎవరు ఎంత సేవ్ చేశారనేది ముఖ్యం. ప్రస్తుత కాలంలో సంపాదించిన డబ్బును పొదుపు చేయడం పెద్ద సవాలుగా మారింది.   

మీ భవిష్యత్ కోసం డబ్బు ఆదా చేసుకోండి. ప్రస్తుతం డబ్బు ఆదా చేసుకుంటే అత్యవసర పరిస్థితులలో లేదా పదవి విరమణ తరువాత మీకు ఉపయోగపడుతుంది. ముందుగా మీరు దేని కోసం పొదుపు చేయాలో తెలుసుకోండి.  

శాలరీ అకౌంట్ కాకుండా.. మరో సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయండి. మీ శాలరీ అకౌంట్‌లో జీతం క్రెడిట్ అవ్వగానే.. కొంత సేవింగ్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యేలా ఆటోమేటిక్ పేమెంట్ మోడ్ సెట్ చేయండి. తద్వారా శాలరీ రాగానే సేవింగ్స్ ఖాతాలోకి కొంత డబ్బు వెళ్తుంది. 

స్వల్ప కాలానికి ఆదా చేయండి. మీరు స్వల్పకాలిక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు.. మరింత విజయవంతంగా ఆదా చేస్తారు. ఉదాహరణకు మీరు 6 నెలల్లో రూ.50 వేలు ఆదా చేయాలని నిర్ణయించుకోండి. ఇప్పుడు అదేవిధంగా మీరు ఒక నెల లేదా 15 రోజులలో మొత్తాన్ని విభజించి.. చిన్న పొదుపు చేయడం ద్వారా మీరు 6 నెలల్లో 50 వేలు ఆదా చేసే దిశగా పయనించవచ్చు. ఒకసారి మీరు నిర్ణయించిన మొత్తాన్ని స్వల్ప కాలానికి ఆదా చేసిన తర్వాత మీరు పొదుపు చేయడం అలవాటు చేసుకుంటారు.  

వీలైనంత త్వరగా పదవీ విరమణ కోసం పొదుపు చేయడం ప్రారంభించండి. దీంతో మీరు సంవత్సరానికి కొంత మొత్తాన్ని ఆదా చేస్తారు.  ఆ మొత్తాన్ని స్థలంలో పెట్టుబడిగా పెట్టండి. పదవీ విరమణ సమయానికి భారీ మొత్తాన్ని పొందవచ్చు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link