UPI Payments: ఇంటర్నెట్ లేకుండా UPI పేమెంట్స్ చేయండి.. ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి చాలు
మీ పేమెంట్స్ యాప్ నుంచి ఇంటర్నెట్ లేకుండా UPI ద్వారా సులభంగా నగదు బదిలీ చేయవచ్చు. కానీ మీ మొబైల్‌లో నెట్‌వర్క్ తప్పనిసరిగా ఉండాలి. కానీ దాని కోసం మీ ఫోన్‌లో తప్పనిసరిగా నెట్‌వర్క్ ఉండాలి.
మొబైల్ డేటా లేదా ఇంటర్నెట్ లేకుండా చెల్లింపు చేయడానికి.. మీరు USSD సేవను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ముందుగా మీ స్మార్ట్‌ఫోన్ నుంచి *99# డయల్ చేయాలి.
ఆ తరువాత మీకు ఒక పాప్-అప్ మెను వస్తుంది. ఇందులో మీరు మొదటి ఎంపికను అంటే 'మనీ పంపండి'ని ఎంచుకోవాలి. ఇప్పుడు UPI ID, బ్యాంక్ ఖాతా వివరాలు, మొబైల్ నంబర్‌తో సహా డబ్బు పంపడానికి ఉన్న ఆప్షన్లు కనిపిస్తాయి.
ఇక్కడ నుంచి చెల్లింపు విధానాన్ని ఎంచుకుని.. అవసరమైన వివరాలను నింపాలి. మీరు ఎంత డబ్బు చెల్లించాలో ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు మీ UPI పిన్‌ని నమోదు చేసి డబ్బును బదిలీ చేయాలి.
ఈ విధంగా మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా మీ స్మార్ట్‌ఫోన్ నుంచి UPI ద్వారా నగదు బదిలీ చేయవచ్చు. అయితే ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి మీ ఫోన్ నంబర్ UPIతో నమోదు లింక్ అయి ఉండాలి.