Monsoon Vegetables: వర్షాకాలం ఈ ఐదు పదార్ధాలకు దూరంగా ఉండండి, లేకపోతే సమస్యలే
వర్షాకాలంలో మష్రూం ఆరోగ్యానికి మంచిది కాదు. వీటివల్ల ఇన్‌ఫెక్షన్ వాటిల్లే ముప్పుు ఉంది. కడుపు నొప్పి సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి.
వర్షకాలంలో ఆకుకూరల్ని సాధ్యమైనంతవరకూ తగ్గించడం మంచిది. ముఖ్యంగా మెంతి కూర, పాలకూర, తోటకూర వంటివి దూరం పెడితే మంచిది. ఎందుకంటే వీటి ఆకుల్లో చిన్న చిన్న పురుగులు ఉండి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.
కాలిఫ్లవర్‌ను వర్షకాలంలో పూర్తిగా దూరం పెట్టాల్సిందే. లేకపోతే ఆరోగ్యానికి చాలా హానికరంగా మారుతుంది.
ఇక రెండవది క్యాబేజ్. వర్షాకాలంలో క్యాబేజ్ తినకూడదు. ఎందుకంటే వర్షాకాలంలో క్యాబేజ్ నిండా పురుగులు ఎక్కువగా ఉండే అవకాశముంది.
వర్షాకాలంలో తినకూడని మరో కూరగాయ వంకాయ. వర్షాకాలంలో పురుగు లేకుండా వంకాయ అనేది ఉండదు.