Monsoon Hair Care Tips: వర్షాకాలంలో జుట్టు అధికంగా రాలుతుందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..ఎందుకో తెలుసా?
వానాకాలంలో జుట్టు రాలడం, స్కాల్ప్ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు తప్పకుండా జుట్టును సంరక్షించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షపు నీరు జుట్టుపై నిలవడం వల్ల ఇలాంటి సమస్యలకు దారి తీసే ఛాన్స్ ఉంది. కాబట్టి వర్షంలో నుంచి వచ్చిన వెంటనే జుట్టును కాటన్ తో తుడుచుకోవాల్సి ఉంటుంది.
వర్షాకాలంలో స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ నుంచి సులభంగా ఉపశమనం లభించడానికి జుట్టుకు నూనెను అప్లై చేయాల్సి ఉంటుంది. నూనెను అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసి తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు రాకుండా ఉంటాయి.
తరచుగా వర్షాకాలంలో మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన షాంపూలతో తలస్నానం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తీవ్ర జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. రసాయనాలతో కూడిన షాంపూలకు బదులుగా సాధారణ షాంపులను వినియోగించడం చాలా మంచిది.
చాలామంది వానాకాలంలో హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అతిగా వినియోగిస్తూ ఉంటారు. వీటిని వినియోగించడం ఎంత తగ్గిస్తే.. అంత మంచిదని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే రసాయనాల ప్రభావం జుట్టుపై పడి రాలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
వర్షాకాలంలో జుట్టును ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు తప్పకుండా తీసుకోవాలి. అంతే కాకుండా చక్కెర గల పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అనారోగ్యకరమైన ఆహారాలకు కూడా దూరంగా ఉండటం చాలా మంచిది.