Cassowary Bird: అత్యంత భయంకరమైన, మనుషులపై సైతం ఎటాక్ చేసే పక్షి ఇదే
కైసోవరీ పక్షి కాళ్లు,. పంజాలు చాలా పటిష్టంగా ఉంటాయి. ఇవి ఎంత శక్తివంతమైనవంటే మనుషులపై కూడా ఎటాక్ చేయగలవు
కైసోవరీ సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీనికి ముఖ్య కారణం నివాసాలు నష్టపోవడమే.
కైసోవరీ పక్షి రెక్కలు పొడుగ్గా, పల్చగా ఉంటాయి. ఎగురడానికి పనిచేయవు. వీటి రెక్కలు వర్షం, దుమ్ము నుంచి కాపాడుతాయి.
కైసోవరీ , ఈము వేర్వేరు. ఒకే జాతికి చెందినవి. ఈము పక్షిలో తలపాగా ఉండదు. చూడ్డానికి కైసోవరికి భిన్నంగా ఉంటుంది. కైసోవరీ డైనోసార్ వంశానికి చెందింది.
కైసోవరీలో ఆడ పక్షి గుడ్లు పెట్టి వెళ్లిపోతుంది. మగ పక్షి వాటిని కాచుతుంది. పిల్లల్ని సంరక్షిస్తుంది.
కైసోవరీ పక్షి పండ్లు తింటుంది. విత్తనాలను దూరంగా విసిరేస్తుంది. దాంతో అడవి పెరుగుతుంది.
కైసోవరీ తలపై కైస్క్ ఉంటుంది. ఇది కేరాటిన్‌తో తయారవుతుంది. ఇది గొంతును పెంచుతుంది. తలకు రక్షణ కల్పిస్తుంది.
కైసోవరీ పక్షి మూడు రకాలుగా ఉంటుంది ఉత్తర, దక్షిణ, డ్వార్ఫ్. ఇందులో దక్షిణ కైసోవరీ ముఖం నీలి రంగులో ఉంటుంది. మెడలో ఎరుపు రంగు ఆకారం ఉంటుంది. తలపై కఠినమైన తలపాగా లాంటిది ఉంటుంది.