Most Expensive Currency: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కరెన్సీ ఏదో తెలుసా..! డాలర్ కంటే చాలా ఎక్కువ

Wed, 27 Sep 2023-12:21 am,

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కరెన్సీ కువైట్ దినార్. దీని కోడ్ KWD. కువైట్ పశ్చిమాసియాలో ఒక సంపన్న దేశం. ఇది ప్రపంచంలో ఆరవ అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉంది. ఇక్కడ ఒక దీనార్ విలువైన వస్తువును కొనుగోలు చేయడానికి మన కరన్సీలో రూ.267 ఖర్చు చేయాల్సి ఉంటుంది.   

ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన కరెన్సీ బహ్రెయిన్ దినార్. దీని కోడ్ BHD. ఒక బహ్రెయిన్ దినార్ విలువ మన దేశ కరెన్సీలో రూ.218లకు సమానం.   

ఒమన్ అధికారిక కరెన్సీ ఒమానీ రియాల్. ప్రపంచంలో మూడవ అత్యంత ఖరీదైన కరెన్సీ. ఇది అరేబియా ద్వీపకల్పానికి ఆగ్నేయంలో ఉన్న ముస్లిం దేశం. ఒక ఒమానీ రియాల్ విలువ మన కరెన్సీలో 214 రూపాయలకు సమానం.  

ప్రపంచంలో నాల్గవ అత్యంత శక్తివంతమైన, ఖరీదైన కరెన్సీ జోర్డానియన్ దినార్. ఇది 1950 నుంచి జోర్డాన్ దేశంలో అధికారిక కరెన్సీగా చలామణి అవుతోంది.. జోర్డాన్ ఒక అరబ్ దేశం. జోర్డానియన్ దినార్ విలువ 117 రూపాయలకు సమానం.    

బ్రిటీష్ పౌండ్ ప్రపంచంలోని 5వ అత్యంత ఖరీదైన కరెన్సీ. ఇది యునైటెడ్ కింగ్‌డమ్ అధికారిక కరెన్సీ. మరికొన్ని దేశాల్లో కూడా బ్రిటిష్ పౌండ్‌ను ఉపయోగిస్తున్నాయి. ఒక బ్రిటిష్ పౌండ్ 102 రూపాయలకు సమానం.  

స్విట్జర్లాండ్, లీచ్టెన్‌స్టెయిన్ కరెన్సీ స్విస్ ఫ్రాంక్. దీని కోడ్ CHF. ఒక స్విస్ ఫ్రాంక్ విలువ మన దేశ కరెన్సీలో 91 రూపాయలకు సమానం.   

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కరెన్సీలలో యూరో 9వ స్థానంలో ఉంది. ఈ కరెన్సీ కోడ్ EUR. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరమైన కరెన్సీలలో ఒకటిగా పరిగణిస్తారు. ఒక యూరో మన దేశ కరెన్సీలో 88 రూపాయలకు సమానం.  

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కరెన్సీల లిస్ట్‌లో డాలర్ 10వ స్థానంలో ఉంది. ప్రస్తుతం చాలా దేశాలలో డాలర్‌ను ఉపయోగిస్తున్నారు. ఎక్కువ శాతం బిజినెస్ డాలర్లలో జరుగుతుందన్నందున శక్తివంతమైన కరెన్సీగా మారింది. ఒక డాలర్ మన కరెన్సీలో 83.09 రూపాయలకు సమానం.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link