Snakes Shocking Facts: పాముల గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు, నాలుకతో వాసన చూస్తాయా
ఈకోసిస్టమ్
పాములు భూమ్మీద ఉన్న ఈకోసిస్టమ్ కు ప్రధానంగా ఉపయోగపడతాయి. ఇవి లేకపోతే పుడ్ చైన్ వ్యవస్థ బ్యాలెన్స్ తప్పుతుంది. కీటకాలు, పక్షులు, స్మాల్ మమ్మల్స్, కప్పల సంఖ్య పెరిగిపోతుంది.
పాము నాలుకతో వాసన పసిగడుతుందా
ఇతర జంతువుల్లా పాములు ముక్కుతో వాసన పసిగట్టవు. నాలుకను ఉపయోగిస్తాయి. అందుకు అనుగుణంగా పాముల్లో యూనిక్ స్ట్రక్చర్ జాకోబ్ సన్ ఆర్గాన్ అనేది పాము నోటి పైభాగంలో ఉంటుంది. నాలుక ద్వారా సెంట్ మోలిక్యూల్స్ పిక్ చేసేందుకు దోహదం చేస్తుంది. పాముల్లో చీలిన నాలుక ఇందుకు ఉపయోగపడుతుంది
సోలార్ పవర్ ఉంటుందా
పాముల గురించి కోల్డ్ బ్లడెడ్ అనే మాట వాడుకలో ఉంది. కానీ వాస్తవానికి పాముల రక్తం చల్లగా ఉండనే ఉండదు. వాస్తవానికి పాముల రక్తం వెచ్చగా ఉంటుంది. పాముల శరీర ఉష్ణోగ్రత సూర్యుని బట్టి ఉంటుంది
సముద్ర పాములు
చాలా వరకూ పాములు భూమ్మీదే మనుగడ సాగిస్తుంటాయి. 70 రకాల పాము జాతులు హిందూ మహా సముద్రం, పసిఫిక్ మహా సముద్రంలో జీవిస్తాయి. సముద్ర పాములు నీటి ప్రపంచానికి అలవాటయి..భూమ్మీద కదల్లేవు.
142 మిలియన్ ఏళ్ల క్రితమే పాముల ఉనికి
పాములు ఎప్పుడు భూమ్మీదకు వచ్చాయనేది కచ్చితంగా తెలియదు. కానీ తవ్వకాల్లో బయటపడిన అవశేషాల ప్రకారం ఇవి Cretaceous Periodకు చెందినవని, 98-142 మిలియన్ ఏళ్ల క్రితం నాటివని తెలిసింది. అంతకంటే ఆశ్చర్యమేంటంటే క్రోకోడైల్స్, లిజార్డ్స్, టర్టిల్స్ అంతకంటే ప్రాచీనమైనవి.
3,700 పాము జాతులు
పాముల్లో మొత్తం 3,789 జాతులు ఉన్నాయని తాజా అధ్యయనాల ద్వారా తేలింది. అణ్వేషణ ముందుకు సాగేకొద్దీ పాము జాతుల సంఖ్య పెరుగుతోంది. రెండేళ్ల క్రితం కొత్తగా కనుగొన్నది Phalotris Shawnella.ఇది ఆరెంజ్, బ్రౌన్, రెడ్ రంగుల్లో పెరాగ్వేలో కన్పించింది