Gas Acidity Remedies: గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తొలగించే శక్తివంతమైన చిట్కాలు
కొబ్బరి నీటిని అమృతంతో పోలుస్తారు. అంతటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. కొబ్బరి నీటరు ఎసిడిటీ సమస్య నుంచి గట్టెక్కిస్తుంది. ఎవరైనా వ్యక్తి రోజూ కొబ్బరి నూనె తాగితే కడుపు పూర్తిగా క్లీన్ అవుతుంది
కడుపు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఈ రెమిడీస్ అద్భుతంగా పనిచేస్తాయి.
అరటి పండ్లలో పొటాషియం పెద్దమొత్తంలో ఉంటుంది. ఫలితంగా కడుపులో మంటను తగ్గిస్తుంది. ఎప్పుడైనా ఎసిడిటీ సమస్య తలెత్తితే బాగా పండిన అరటి పండు ఒకటి తింటే చాలు
పెరుగు కూడా మరో బెస్ట్ ప్రత్యామ్నాయం. ఇది సహజసిద్ధమైన ప్రో బయోటిక్. పెరుగుతో జీర్ణక్రియ పటిష్టమౌతుంది. భోజనంతో పాటు ఎవరైనా పెరుగు తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచి అలవాటు. ఎసిడిటీ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు
సోంపు, జీలకర్ర నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఒక స్పూన్ సోంపు, ఒక స్పూన్ జీలకర్రను నీటిలో ఉడికించి తాగాలి. ఇలా చేయడం వల్ల గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు