Drishti Tips In Telugu: నరదిష్టితో బాధపడుతున్నారా? రోజు ఇలా చేయండి.. నెలరోజుల్లో మీకే తెలుస్తుంది!
జీవితంలో ఎవరైనా తప్పకుండా ఒక్కసారైనా దిష్టి బారిన పడతారు. దీని కారణంగా తీవ్ర ఇబ్బందుల బారిన పడాల్సి వస్తుంది. అయితే ఈ దిష్టి బారిన పడిన వారు తప్పకుండా దానిని నుంచి ఎంత తొందరగా పడితే అంత తొందరగా తేరుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కుటుంబ జీవితంపై తీవ్ర ఇబ్బంది పడుతుంది.
దిష్టి తగలడం వల్ల ఎంతవారైనా అనేక ఇబ్బందుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ధనవంతులు కూడా ఈ సమయంలో అనేక దీర్ఘకలిక సమస్యల బారిన పడే ఛాన్స్ ఉంది. కాబట్టి దీని బారి పడకుండా ఉండాలని కోరుకోవాల్సి ఉంటుంది.
శాస్త్రాలు తెలిపిన వివరాల ప్రకారం.. కన్ను, నర దిష్టి ఉన్నవారు ఎలాంటి పనులు తలపెట్టిన దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని రకాల ఇతర దిష్టిలు కూడా అనేక సమస్యలకు దారి తీస్తాయి.
ముఖ్యంగా ప్రతి రోజు 'ఓం తత్పురుషాయ విఘ్న హే అనే మంత్రాన్ని రోజు పఠించడం వల్ల అనేక రకాల దిష్టిల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఉండే దుష్ట శక్తులు కూడా తొలగిపోతాయని శాస్త్రంలో పేర్కొన్నారు.
అలాగే ఇంటి ముందు కను దిష్టి యంత్రాన్ని పెట్టుకోవడం వల్ల కూడా సులభంగా ఈ దిష్టి నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే దీనిని గోడకు ఉత్తరం దిశగా ఉంచడం మరింత మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.