Most profitable Movies of 2024: పుష్ప 2, కల్కి, దేవర సహా 2024లో ఎక్కువ లాభాలను తీసుకొచ్చిన చిత్రాలు..
పుష్ప 2 ది రూల్..
సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమా లాస్ట్ ఇయర్ డిసెంబర్ 5న విడుదలైన భారతీయ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు ఎక్కువ లాభాలను తీసుకొచ్చిన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా హిందీ వసూళ్లతోనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఓవరాల్ గా రూ. 615 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన పుష్ప 2 .. సుమారుగా చేసిన బిజినెస్ పై రూ. 200 కోట్ల పైగా లాభాలను తీసుకొచ్చింది.
కల్కి 2898 AD..
రెబల్ స్టార్ ప్రభాస్ భైరవగా.. కర్ణుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై తెరకెక్కిన భారీ చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 1111 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా రూ. 370 కోట్ల బిజినెస్ పై దాదాపు రూ. 170 కోట్ల వరకు లాభాలను తీసుకొచ్చింది.
హనుమాన్.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. రూ. 29.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం 128 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
దేవర పార్ట్ 1.. ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయంలో కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘దేవర పార్ట్ 1’. ఈ సినిమా ఓవరాల్ గా రూ. 501 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా రూ. 182.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ పై రూ. 74.60 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
టిల్లు స్క్వేర్.. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ పై రూ. 42 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
అమరన్ (డబ్బింగ్)..
శివకార్తీకేయన్, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘అమరన్’. ఈ చిత్రం తెలుగులో రూ. 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ పై ఓవరాల్ గా రూ. 23 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.