Countries without Indians: ఆ 5 దేశాల్లో ఒక్క ఇండియన్ కూడా లేడంటే నమ్ముతారా, ఇవే ఆ దేశాలు
వాటికన్ సిటీ
రోమ్ దేశంలోని వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఈ దేశంలోని కేథలిక్ చర్చ్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. ప్రతి ఏటా భారతీయులు వాటికన్ సిటీ సందర్శిస్తుంటారు కానీ ఎవరూ అక్కడ నివాసం ఏర్పరచుకోలేదు.
శాన్ మారినో
ఇటలీలోని ఎపేనిన్ పర్వతాల్లో ఉన్న శాన్ మారినో ప్రపంచంలోని ప్రాచీన రిపబ్లిక్ దేశాల్లో ఒకటి. అద్భుతమైన వాస్తు కళ, సుందర దృశ్యాలు, సముద్రతీరానికి ఈ దేశం ప్రసిద్ధి. శాన్ మారినో సందర్శనకు ఇండియా సహా అన్ని దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు కానీ ఏ ఒక్క భారతీయుడు స్థిరపడలేదు
బల్గేరియా
సౌత్ ఈస్ట్ యూరోపియన్ కంట్రీ బల్గేరియా అద్భుతమైన, అందమైన పర్యాటక ప్రాంతం. ఇక్కడ ఇసుక సముద్రం, బ్లాక్ సీ ఉన్నాయి. అందమైన ప్రకృతి రమణీయత, సాంస్కృతిక వైవిద్యానికి ప్రసిద్ధి. అయినా ఈ దేశంలో ఒక్క భారతీయుడు కూడా ఉండడు
పాకిస్తాన్
ఈ దేశం పేరు విని మీరు ఆశ్చర్యపోయి ఉంటారు. అదేంటి పాకిస్తాన్‌లో ఇండియన్స్ లేకపోవడమేంటని. అక్కడ ఉన్నవాళ్లంతా విభజన సమయంలో లేదా అంతకుముందు ఉన్నవారే. విభజన జరిగి 77 ఏళ్లు పూర్తయ్యాయి. రెండు దేశాల మధ్య తరచూ ఉండే ఉద్రిక్త పరిస్థితులు, టెర్రరిస్టు దాడుల నేపధ్యంలో పాకిస్తాన్‌లో ఏ ఒక్క భారతీయుడు స్థిరపడలేదు.
తువాలు
పసిఫిక్ మహా సముద్రంలోని అందమైన దేశాల్లో ఒకటైన తువాలు ప్రపంచంలో అతి చిన్న, అతి తక్కువ జనాభా కలిగి దేశం. ప్రాచీన సముద్రతీరానికి ఈ దేశం ప్రసిద్ధి. ప్రతి ఏటా భారతీయులు ఇక్కడికి కూడా వస్తుంటారు. కానీ ఎవరూ ఇక్కడ నివాసం లేరు