Mothers Day Special: బాలీవుడ్‌లో సత్తా చూపెట్టిన హీరోయిన్స్ కుమారులు వీళ్లే..
![రణ్‌బీర్ కపూర్ - నీతూ కపూర్ Ranbir Kapoor - Neetu Kapoor](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Ranbir6.jpg)
రణ్‌బీర్ కపూర్ ఒకప్పటి బాలీవుడ్ అగ్ర హీరో, హీరోయిన్లుగా సత్తా చూపెట్టిన రిషీ కపూర్, నీతూ కపూర్‌ల ముద్దుల తనయుడు. ఇతను బాలీవుడ్ టాప్ స్టార్‌గా రాణించాడు.
![అభిషేక్ బచ్చన్ - జయా బచ్చన్ Abhishek Bachchan - Jaya Bachchan](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Abhishek1.jpg)
అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్‌ల ముద్దుల కుమారుడు అభిషేక్ బచ్చన్. ఈమె తల్లి జయా బచ్చన్ ఒకపుడు బాలీవుడ్ అగ్ర హీరోయిన్‌గా సత్తా చాటిన సంగతి తెలిసిందే కదా.
![సంజయ్ దత్ - నర్గీస్ దత్.. Sanjay Dutt - Nargis Dutt](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/Sanjay9.jpg)
బాలీవుడ్ బ్యాడ్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న ఒకప్పటి బాలీవుడ్ అగ్ర హీరో సంజయ్ దత్.. తల్లి నర్గీస్ దత్ ఒకప్పటి బాలీవుడ్ నెంబర్ హీరోయిన్. అటు తండ్రి సునీల్ దత్.. బాలీవుడ్‌లో మొదటి తరం యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
షర్మిలా ఠాకూర్.. బాలీవుడ్ మొదటి తరంలో అందాల కథానాయిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కుమారుడు సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ నటుడిగా సత్తా చూపెడుతున్నాడు.
వైజయంతి మాల బాలీ రీసెంట్‌గా కేంద్రం నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈమె తనయుడు సుచీంద్ర బాలీ తమిళ సినీ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి సత్తా చూపెట్టలేకపోయాడు.
బాలీవుడ్ అగ్ర కథానాయిక డింపుల్ కపాడియా చెల్లెలు సింపుల్ కపాడియా హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఈమె కుమారుడు కరణ్ కపాడియా హీరోగా బాలీవుడ్‌లో ఇపుడిపుడే బుడిబుడి అడుగులు వేస్తున్నాడు.