Motorola Edge 40 Neo Price: ఫీచర్స్‌తో పిచ్చెక్కిస్తున్న మోటరోలా Edge 40 Neo మొబైల్..ధర, ఇతర వివరాలు ఇవే..
ఈ మొబైల్‌ను కంపెనీ సెప్టెంబర్ 21వ తేదిన ఫ్లిఫ్‌కార్ట్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. అయితే విడుదలకు ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ నెట్టింట తెగవైరల్ అవుతున్నాయి.
మోటరోలా Edge 40 Neo అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో రాబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్‌పై పని చేయబోతోంది. ఈ ప్రాసెసర్ అతి శక్తివంతమైనది కావడంతో హై స్పీడ్‌గా పని చేసే అవకాశాలు ఉన్నాయి.
కంపెనీ Edge 40 Neo సిరీస్‌ను మిడ్ రేంజ్‌లో లాంచ్ చేయబోతోంది. ఇక ఈ మొబైల్ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే..Motorola Edge 40 Neo స్మార్ట్ ఫోన్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.
మోటరోలా Edge 40 Neo అతి శక్తివంతమైన 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా 68W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రాబోతోంది. దీంతో మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే మంచి బ్యాటరీ లైఫ్‌ను పొందవచ్చు.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే విషయానికొస్తే..6.55 అంగుళాల పూర్తి HD ప్లస్ poLED కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 1080x2400 పిక్సెల్‌లు రిజల్యూషన్‌తో వస్తుంది. అంతేకాకుండా 144 Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ చేస్తుంది.
ఈ Motorola Edge 40 Neo మొబైల్ ఫోన్ భారత్‌లో విడుదలైతే..ధర రూ.24,999లో విక్రయించే అవకాశాలు ఉన్నాయని టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ పేర్కొన్నారు. అయితే ధరకు సంబంధించిన అధికారిక ప్రకటను కంపెనీ ఇంకా చేయలేదు. అతి త్వరలోనే చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.