Motorola Edge 50 Neo Discount Offer: ఫ్లిఫ్‌కార్ట్‌లో చీప్ ధరకే.. కిర్రాక్ Motorola Edge 50 Neo మొబైల్.. మళ్లీ రాదు గురూ ఈ ఛాన్స్!
ఈ Motorola Edge 50 Neo స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్స్‌తో పాటు Moto Ai పవర్డ్ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించిన మొదటి సేల్‌ను మోటో కంపెనీ ఈ రోజు నుంచి ఫ్లిఫ్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన విక్రయాలను కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో సెప్టెంబర్ 24 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభించబోతోంది. అయితే ఈ మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన తగ్గింపు కూడా లభించనుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Motorola కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌పై 5 సంవత్సరాల పాటు ఫ్రీ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌లను అందించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిఫ్‌కార్ట్‌లో వివిధ రకాల కలర్ ఆప్షన్స్‌తో పాటు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఇతర వివరాల్లోకి వెళితే, ఫ్లిఫ్‌కార్ట్‌లో దీని ధర రూ.23,999 నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఎక్చేంజ్ ఆఫర్స్‌లో భాగంగా భారీ తగ్గింపు పొందవచ్చు.
మోటరోలా ఎడ్జ్ 50 నియో స్పెసిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే, ఇది 6.4-అంగుళాల LTPO P-OLED డిస్‌ప్లేతో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు HDR10+ సపోర్ట్‌తో లాంచ్ కానుంది. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కంపెనీ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ 3000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కూడా అందిస్తోంది.
అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 7300 ప్రాసెసర్‌పై రన్ కానుంది. అలాగే Android 14 ఆధారిత సాఫ్ట్‌వేర్ స్కిన్‌పై రన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కూడా అందిస్తోంది.
ఇక ఈ మొబైల్ బ్యాక్ సెటప్ వివరాల్లోకి వెళితే ఇది 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 10MP టెలిఫోటోతో పాటు 13MP అల్ట్రావైడ్ సెన్సార్‌లను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ఇక ఫ్రంట్ భాగంలో 32MP కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 4310mAh బ్యాటరీ 68W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి రానుంది.