Mrunal Thakur: సీతారామంకి రెండు సంవత్సరాలు..మృణాల్ ఎలా సెలబ్రేట్ చేసుకుందంటే..!
మృణాల్ ఠాకూర్.. హిందీలో చిన్న సీరియల్స్ లో తన కెరియర్ ప్రారంభించింది. ఆ తరువాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో చేసిన.. సూపర్ 30 సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకునింది. అప్పటినుంచి బాలీవుడ్ సినిమాలలో ఈ హీరోయిన్ కి వరస అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి.
తెలుగులో నాని హీరోగా చేసిన జెర్సీ సినిమాని.. హిందీలో కూడా జెర్సీ డైరెక్టర్ గౌతమ్ అదే పేరుతో తెరకెక్కించారు. ఆ చిత్రంలో తెలుగులో శ్రద్ధ శ్రీనాథ్ క్యారెక్టర్ లో.. హిందీలో మృణాల్ ఠాకూర్ కనిపించడం విశేషం. ఆ చిత్రం సైతం మృణాల్ కి మంచి విజయం అందించి పెట్టింది.
అయితే మృణాల్.. స్టార్ స్టేటస్ పూర్తిగా మార్చేసినా సినిమా మాత్రం సీతారామం. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. 2022లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్రంలోని సీత క్యారెక్టర్ తో.. తెలుగు ప్రేక్షకుల మదిలో.. చెరిగిపోని స్థానం సంపాదించుకుంది మృణాల్.
కాగా ఈ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా.. ఈమధ్య ఈ హీరోయిన్ ఈ చిత్రం గురించి.. నెమర వేసుకుంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలలో ఈ హీరోయిన్ ఫారన్ లో కాఫీ తాగుతూ.. అక్కడ షాపింగ్ చేస్తూ కనిపించింది. ఇక ఈ ఫోటోల కింద సీతారామం రెండు సంవత్సరాలను సెలబ్రేట్ చేసుకుంటూ.. అని క్యాప్షన్ కూడా పెట్టింది..
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా సీతారామం సినిమా తర్వాత ఈ హీరోయిన్ నాని హీరోగా.. వచ్చిన హాయ్ నాన్న చిత్రంలో కనిపించింది. ఈ సినిమా కూడా ఆమెకు మంచి విజయం అందించి పెట్టింది. అయితే ఈ మధ్య విడుదలైన ఫ్యామిలీ స్టార్ మృణాల్.. తెలుగు కెరియర్ లో డిజాస్టర్ గా మిగిలింది. ఇక త్వరలో ఈ హీరోయిన్ నటించిన ప్రాజెక్ట్స్ గురించి.. అయితే ప్రస్తుతానికి క్లారిటీ లేదు.