Mrunal Thakur: గ్రీన్ డ్రెస్సులో మృణాల్.. ఇలా ఎప్పుడూ చూసి ఉండరు..
బాలీవుడ్ లో చిన్న సీరియల్స్ ద్వారా తన కెరీర్ ని మొదలుపెట్టిన నటి మృణాల్ ఠాకూర్. 2012లో ముజ్సే కుచ్ కెహెతి...ఏ ఖామోషియాన్ అనే హిందీ సీరియల్ ద్వారా నటనారంగంలోకి అడుగుపెట్టిండి
ఆ తరువాత 2014లో విడుదలైన 'విట్టి దండు' అనే మరాఠి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. లవ్ సోనియా అనే హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్ లో కూడా తన ప్రయాణం మొదలు పెట్టిన మృణాల్.. ఆ తరువాత దాదాపు 7 సినిమాలలో కనిపించింది.
కానీ ఇవేవీ ఆమెకు తెచ్చి పెట్టనంత పేరు తెలుగులో చేసిన సీతారామం సినిమా తెచ్చిపెట్టింది. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.
అప్పటినుంచి ఈ హీరోయిన్ కి తెలుగులో వరస అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఈ మధ్యనే హాయ్ నాన్న చిత్రంతో మరో సక్సెస్ అందుకున్న ఈ హీరోయిన్ ఇటీవల విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ లో కనిపించింది..
కాగా ఎల్లప్పుడూ ఇంస్టాగ్రామ్ లో సైతం యాక్టివ్ గా ఉండే మృణాల్ ..ప్రస్తుతం షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.