Mrunal Thakur: అదిరిపోయే డ్రెస్సులో మృణాల్ ఠాకూర్…మతిపొగోడుతున్న హీరోయిన్
Mrunal Thakur Pics: దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది
మొదటి చిత్రం మంచి విజయం సాధించిన తర్వాత.. తన తదుపరి చిత్రాలను కూడా నటన ప్రాధాన్యత ఉన్నవే ఎంచుకుంటూ వస్తోంది.
ముఖ్యంగా తన రెండవ సినిమా హాయ్ నాన్న ఈ మధ్య విడుదలై మంచి విజయం సాధించింది. నాని హీరోగా చేసిన ఈ చిత్రం మృణాల్ పర్ఫామెన్స్ కి మంచి మార్కులు తెచ్చి పెట్టింది
ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో బిజీగా ఉంది ఈ నటి.
ఈ నేపథ్యంలో మృణాల్ ఠాకూర్ ముంబైలో కనిపించగా.. అక్కడ కొంతమంది ఫోటోగ్రాఫర్లు తీసిన తన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలలో మల్టీకలర్ మోడరన్ మ్యాక్సీ డ్రెస్ లో కనిపించి తన అభిమానుల మతిని పొగోడుతోంది మృణాల్ ఠాకూర్.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. ఈ హీరోయిన్ అభిమానులు ఇందులో మృణాల్ అందం చూసి ఫిదా అయిపోతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.