Mrunal Thakur: ఆ నిర్ణయమే స్టార్ స్టేటస్ ను కోల్పోయేలా చేసిందా..?

Tue, 20 Aug 2024-11:37 pm,

 ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మృనాల్ ఠాకూర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సీరియల్స్ ద్వారా కెరియర్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తెలుగులో సీతారామం సినిమాతో మొదటి చిత్రంతోనే హీరోయిన్ గా ప్రశంసలు అందుకున్న ఈమె తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటూ మరింత స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుంది.

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించిన మృనాల్ ఠాకూర్,  ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బెంగాలీ సినీ పరిశ్రమకు చెందిన ఈమె హిందీలో సూపర్ 30, జెర్సీ చిత్రాలలో నటించింది. అయితే తెలుగులో సీతారామం సినిమా తోనే మహాలక్ష్మి పాత్రలో మరింతగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత హాయ్ నాన్న , ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది.

ఇదిలా ఉండగా  ప్రస్తుతం తమిళంలో హీరో శివ కార్తికేయన్ కు జోడిగా.. నటించే అవకాశాన్ని వదులుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు హోమ్లీ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె కెరియర్ మొదట్లో లిప్ లాక్ సన్నివేశాలలో నటించి తల్లిదండ్రులను సైతం ఆశ్చర్యపరిచింది. దీంతో సినిమాలలో నటించడానికి ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకించారు.   

అందుకే లిప్ లాక్ సన్నివేశాలలో నటించకూడదని నిర్ణయించుకుందట. ఆ కారణంగానే పెద్ద పెద్ద సినిమాలలో కూడా అవకాశాలు కోల్పోయానని చెప్పుకొచ్చింది మృనాల్ ఠాకూర్. ఒకవేళ ఆ సినిమాలలో నటించి ఉండి ఉంటే నేడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయేదాన్ని అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ట్రెండుకు తగ్గట్టుగా లిప్ లాక్ సన్నివేశాలలో నటించడం చాలా అవసరం . హీరోయిన్లు ఈ సన్నివేశాలకు తప్పకుండా ప్రిపేర్ అయి ఉండాల్సి ఉంటుంది.   

అయితే ఇలాంటి పాత్రలలో నటించకపోవడం వల్లే పెద్ద పెద్ద ఆఫర్లను కోల్పోయాను అంటూ చెప్పుకొచ్చింది మృణాల్ ప్రస్తుతం తల్లిదండ్రులను ఒప్పించి ముద్దు సన్నివేశాలలో నటించడం కెరియర్ కు అవసరమని తెలిపిందట. ఇక ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకునే పనిలో పడింది ఈ ముద్దుగుమ్మ.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link