Hardhik Pandya: ముంబై ఇండియన్స్ నుంచి హార్థిక్ పాండ్యా ఔట్..? ఆ ప్లేయర్ గట్టి దెబ్బ తీశాడుగా..!
ఐపీఎల్ 2025 మెగా వేలం డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉంది. ఈలోపు రిటైన్ ప్లేయర్ల జాబితాను అన్ని జట్లు సిద్ధం చేసుకుంటున్నాయి. అన్ని లెక్కలు వేసుకుని.. వేలంలోకి విడుదల చేసే ఆటగాళ్ల లిస్ట్ రెడీ చేస్తున్నాయి.
ముంబై ఇండియన్స్ జాబితాను ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ జట్టును వీడనున్నాడని ప్రచారం జరుగుతోంది.
ముంబైకు ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మను నిర్దాక్షిణ్యంగా తప్పించి హార్థిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేసింది. అయితే పాండ్యా నాయకత్వంలోనూ జట్టు తీరు మారలేదు.
ఈ సీజన్‌లోనూ గ్రూపు దశలోనే తప్పుకుంది. పాండ్యా అటు కెప్టెన్‌గా.. ఇటు ప్లేయర్‌గా విఫలమయ్యాడు. పాండ్యాపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే చివరికి దారుణంగా విఫలమయ్యాడు.
ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ 2025 వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను జట్టు నుంచి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ విడుదల చేయనున్నట్లు సమాచారం. పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.
టీ20 ప్రపంచ కప్ విజయం తరువాత కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటనతో తదుపరి కెప్టెన్‌గా హార్థిక్ పాండ్యా అవుతాడని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ పేరు తెరపైకి వచ్చింది. కొత్త గౌతమ్ గంభీర్ కూడా సూర్యకే ఓటు వేశాడు.
శ్రీలంకతో టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ కూడా కెప్టెన్సీ మార్పుపై ఆలోచిస్తున్నట్లు సమాచారం.
హార్థిక్ పాండ్యాను టీమ్ నుంచి రిలీజ్ చేసి.. సూర్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పటించేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది.