Sonia Balani: `ది కేరళ స్టోరీ`లో ముస్లిం అమ్మాయిగా నటించిన సోనియా బలానీ మోడ్రన్ డ్రెస్సుల్లో అదిరిపోయింది చూశారా?

Tue, 09 May 2023-5:00 pm,

ఆదా శర్మ సిద్ది ఇద్నానీ, సోనియా బలాని ప్రధాన పాత్రలలో నటించిన ది కేరళ స్టోరీ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు నమోదు చేస్తూ ముందుకు వెళుతోంది.

 

ఈ సినిమాలో ఆసిఫా అనే ముస్లిం అమ్మాయి పాత్రలో సోనియా బలాని నటించి ఒక్కసారిగా బ్రేక్ దక్కించుకుంది. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జన్మించిన ఈ భామ 2016లో సినీ రంగ ప్రవేశం చేసింది.

 

ఆ తర్వాత బజార్ అనే మూవీలో కూడా నటించింది. కానీ ఈ రెండు సినిమాలు ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. అయితే 2023లో విడుదలైన ది కేరళ స్టోరీ ఆమెకు స్టార్ క్రేజ్ తీసుకొచ్చింది.

   

ఆమె సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా టీవీ సీరియల్స్ లో గట్టిగానే కనిపించింది.

 

సోనీ ఎంటర్టైన్మెంట్ ఛానల్, జీ టీవీ, స్టార్ ప్లస్, ఛానల్ వి వంటి చానల్స్ లో పలు కార్యక్రమాలలో కనిపించి టెలివిజన్ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link