Natural Tips For Belly Fat: ఈ సింపుల్‌ టిప్స్‌తో.. బెల్లీ ఫ్యాట్‌ వెన్నలాగా కరిగిపోతది..!

Thu, 04 Jul 2024-9:22 pm,

మీ శరీర బరువు పెరుగుతూ ఉంటే అది ఊబకాయానికి దారితీస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు, మధుమేహం వంటి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.  

అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలి అంటే మీరు వెంటనే ఈ చిన్న చిన్న టిప్స్‌ను పాటించాల్సి ఉంటుంది.   

గంటల తరబడి కుర్చీలో కూర్చోవద్దు. ప్రతి అరగంటకో లేదా గంటకో లేచి, కొంచెం నడవండి లేదా మీ స్థానంలోనే శరీరాన్ని స్ట్రెచ్ చేయండి.   

ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.  

ప్రతిరోజూ ఉదయం కనీసం 30 నిమిషాల పాటు నడవండి. నడక వల్ల కేలరీలు కరిగి, బరువు తగ్గుతారు.  

లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కండి. ఇలా చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్, తొడల్లో పేరుకున్న కొవ్వు కరుగుతుంది.  

వ్యాయామంతో పాటు ఆహారంలో కొన్ని పోషకరమైన పదార్థాలను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను అదుపు చేయవచ్చు.   

ప్లాంక్స్, సిట్ అప్స్ వంటి వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోండి.  

చియా గింజలు, పుదీనా టీ, యాపిల్ సైడర్‌ వెనిగర్‌ జ్యూస్‌లు, నిమ్మకాయ రసం వంటి ఆహారం పానీయాలు తీసుకోవాల్సి ఉంటుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link