Mutton: మధుమేహులు మటన్ తింటున్నారా? కొంపమునిగినట్లే.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే?
డయాబెటిస్‌తో బాధపడేవారు మన దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు తప్పకుండా ఉంటారు. ఇది ఫ్యామిలీ హిస్టరీ, బ్యాడ్ లైఫ్ స్టైల్ ఇతర ఆరోగ్య సమస్యల వల్ల వస్తుంది. ఒకసారి డయాబెటిస్ వస్తే అది జీవితాంతం పోదు. కానీ వాటి దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటే ఇన్సులిన్ ఉత్పత్తి సరైన క్రమంలో జరిగితే డయాబెటిస్ కంట్రోల్ లో ఉన్నట్టే.
అయితే డయాబెటిస్ తో బాధపడేవారు ఆహారంలో ముఖ్యంగా కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా మటన్ లో శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి డయామెటీస్‌తో బాధపడేవారు మటన్ తినకపోవడమే మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
ఎందుకంటే మటన్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. హాట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఏదైనా పరిమితంగా తీసుకోవాలి.. దీనికి బదులుగా వీళ్ళు చేపలు తీసుకున్న మంచిది అప్పుడప్పుడు చికెన్ కూడా తినవచ్చు.
ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం కూరగాయలు ముఖ్యంగా ఆకుకూరలు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తమ డైట్లో చేర్చుకోవాలి. అంతేకాదు ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు, షుగర్ తక్కువగా ఉండే పండ్లు ఏవైనా మితిమిరపకుండా తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఇవి కాకుండా ఎక్సర్సైజులు కూడా క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి ముఖ్యంగా తిన్నాక వాకింగ్ చేయాలి.
అంతేకాదు ఏవైనా ఆహారాలు తిన్న వెంటనే పడుకోకూడదు. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరిగిపోతాయి. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ సరైన సమయంలో చేయాలి. షుగర్ వ్యాధితో బాధపడేవారు కొంచెం కొంచెం ఆహారం ఎక్కువసార్లు తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మోతాదులో తినకూడదు.