Nabha Natesh: ఆఫర్స్ కోసం మరోసారి గ్లామర్ షోను నమ్ముకున్న ఇస్మార్ట్ పోరి నభా నటేష్..

Wed, 03 Jul 2024-8:07 am,

స్వతహాగా కన్నడ భామ అయిన నభా నటేష్ శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన 'వజ్రకాయ' మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది.

తెలుగులో సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ 'నన్ను దోచుకుందువటే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నభా. 

నటా నటేష్ తెలుగు ప్రేక్షకులకు కొత్త పరిచయాలు అక్కర్లేదు. మధ్యలో అనారోగ్యం కారణంగా గ్యాప్ వచ్చిన ఈ భామ.. ఇపుడు స్వయంభూ మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.

‘స్వయంభూ’ మూవీతో నభా నటేష్ కెరీర్ కొత్త టర్న్ తీసుకుంటుందా ?అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

చేసినవి కొన్ని చిత్రాలైనా.. తన గ్లామర్ షో మరియు నటనతో యూత్‌కు ఫేవరేట్ హీరోయిన్ గా అయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. త్వరలో చేయబోయే సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తోంది.

నభా నటేష్..11 డిసెంబర్ 1995లో కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో జన్మించింది. అక్కడే చదువు పూర్తి చేసుకుంది. 19 యేళ్లకే సినీ ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link