Nabha Natesh: నల్ల చీరలో నభా నటేష్ అందాల జాతర.. పిక్స్ వైరల్..

Tue, 21 May 2024-10:15 am,

తెలుగులో సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. 

నభా నటేష్..బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్‌తో సంబంధం లేకుండా కథానాయికగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

స్వతహాగా కన్నడ భామ అయిన నభా నటేష్.. శివరాజ్ కుమార్ హీరోగా నటించిన 'వజ్రకాయ' మూవీతో కథానాయిగా పరిచయమైంది.  

నభా నటేష్ .. ఆకర్షించే గ్లామర్ మరియు యాక్టింగ్‌తో  తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజే సంపాదించింది ఇస్మార్ట్ పోరి.

తెలుగులో నన్ను దోచుకుందువటే తర్వాత ఇస్మార్ట్ శంకర్, సోలో బ్రతుకే సో బెటరు, డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, మేస్ట్రో సినిమాలతో పలకరించింది. తాజాగా స్వ‌యంభూ మూవీతో కథానాయిక‌గా రీ ఎంట్రీ ఇస్తోంది.

నభా నటేష్..11 డిసెంబర్ 1995లో కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో జన్మించింది. అక్కడే చదువు పూర్తి చేసుకుంది. 19 యేళ్లకే సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.

నభా నటేష్.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ వెళుతుంది. ఆ మధ్య భుజం గాయం కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. ప్రెజెంట్ మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link