Nabha Natesh: బాత్రూమ్‌లో బ్లాక్ డ్రెస్‌లో నభా నటేష్ అందాల రచ్చ..
స్వతహాగా కన్నడ భామ అయిన నభా నటేష్ అక్కడ శివరాజ్ కుమార్ హీరోగా నటించిన 'వజ్రకాయ' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
నభా నటేష్ .. ఆకర్షించే గ్లామర్ మరియు నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజే సంపాదించింది ఇస్మార్ట్ పోరి. కన్నడ భామ అయిన తెలుగులో మొన్నటి వరకు సత్తా చూపెట్టింది.
తెలుగులో సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ 'నన్ను దోచుకుందువటే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
తెలుగులో నన్ను దోచుకుందువటే తర్వాత ఇస్మార్ట్ శంకర్, సోలో బ్రతుకే సో బెటరు, డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, మేస్ట్రో సినిమాలతో పలకరించింది. తాజాగా స్వయంభూ మూవీతో కథానాయికగా రీ ఎంట్రీ ఇస్తోంది.
నభా నటేష్..11 డిసెంబర్ 1995లో కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో జన్మించింది. అక్కడే చదువు పూర్తి చేసుకుంది. 19 యేళ్లకే సినీ ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతుంది.
బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్‌తో సంబంధం లేకుండా కథానాయికగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నభా నటేష్.
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ వెళుతుంది. ఆ మధ్య భుజం గాయం కారణంగా సినిమాలకు దూరంగా ఉంది.