Senior stars Remuneration: బాలయ్య, చిరు సహా తెలుగు సీనియర్ టాస్ స్టార్స్ ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకొంటున్నారో తెలుసా..!
ప్రస్తుతం తెలుగు స్టార్ హీరోల్లో సీనియర్స్ కూడా ఉన్నారు. వీళ్లు కూడా ఒక్కో సినిమాకు భారీగానే పారితోషకం అందుకుంటున్నారు. అందులో ఎవరు ఎంత తీసుకుంటున్నారో మీరు ఓ లుక్కేయండి..
బాలకృష్ణ.. నందమూరి బాలకృష్ణ.. హీరోగా 50 యేళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. అంతేకాదు హీరోగా.. శాసన సభ్యుడిగా హాట్రిక్ విజయాలతో మంచి ఊపుమీదున్నారు. భగవంత్ కేసరి' సక్సెస్ తర్వాత తన పారితోషకాన్ని రూ. 15 కోట్ల నుంచి రూ. 25 కోట్లకు పెంచారు. ‘డాకూ మహారాజ్’, అఖండ 2 కోసం ఇంతే తీసుకుంటున్నట్టు సమాచారం.
చిరంజీవి.. మెగాస్టార్ చిరంజీవి ఒక్కో చిత్రానికి దాదాపు రూ. 40 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారు. విశ్వంభర కోసం దాదాపు రూ.50 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
రవితేజ..
రవితేజ ప్రస్తుతం ఒక్కో సినిమా కోసం రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు అందుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
నాగార్జున..
అక్కినేని నాగార్జున ఒక్కో చిత్రం కోసం దాదాపు రూ. 7 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం.
వెంకటేష్.. విక్టరీ వెంకటేష్ ఒక్కో సినిమా కోసం రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో పాటు ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ సీజన్ 2 కోసం దాదాపు రూ. 25 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం.