Sobhita Dhulipala: మరీ టూమచ్.. శోభిత మెడలో కట్టబోయే తాళి బొట్టు విషయంలో ఇన్ని కండీషన్‌లా ..?.. అవాక్కవ్వడం పక్కా..

Sat, 23 Nov 2024-2:57 pm,

శోభితా, నాగచైతన్యల ఎంగెజ్ మెంట్ ఆగస్టు 8 వ తేదీన కొద్ది మంది స్నేహితులు, బంధువుల మధ్యలో జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగార్జున తన ఇన్ స్టాలో వీరి ఎంగెజ్ మెంట్ ఫోటోలను షేర్ చేశారు. అయితే .. వీరి ఎంగెజ్ మెంట్ అయినప్పటి నుంచి ఏదో ఒక రూమర్స్ తో శోభితా, చైతు తరచుగా వార్తలలో ఉంటున్నారు. 

కొన్నిసార్లు వీరికి పెళ్లి సంబంధించిన వార్తలతో ట్రెండింగ్ లో ఉంటే మరికొన్నిసార్లు.. ఏదో వివాదాస్పద అంశం రూమర్స్ తో వైరల్ అవుతున్నారు. ఇప్పటికే వీరి పెళ్లి జరగదని, నాగార్జున ఫ్యామిలీ వేణు స్వామి చేసిన వ్యాఖ్యలతో మరోసారి ఆలోచనలో పడ్డారని వార్తలు వచ్చాయి. జపాలు, హోమాలు చేసుకున్న తర్వాత మరో వెడ్డింగ్ డేట్ అనౌన్స్ చేస్తారని రూమర్స్ వచ్చాయి. అంతే కాకుండా.. కొన్నిసార్లు వీరు పెళ్లి క్యాన్షిల్ చేసుకున్నారని కూడా వార్తలు వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలో.. తాజాగా, వీరి పెళ్లి మూహుర్తంకు చెందిన కార్డు తెరమీదకు రావడంతో ఈ రూమర్స్ కు చెక్ పడిందని చెప్పుకొవచ్చు.  డిసెంబర్ 4వ తేదీ 8:13 నిమిషాలకు హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మెడలో, నాగ చైతన్య మూడు మూళ్లు వేయనున్నారు. ఈ వేడుక అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. అయితే..ఇప్పుడు మరో వార్త ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.

పెళ్లి వేడుకలో వధువు మెడలో కట్టబోయే మంగళ సూత్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే.. ఈ మంగళసూత్రం తయారు చేయించడంలో కూడా అక్కినేని ఫ్యామిలీ ఎన్నో నియమాలను పాటిస్తున్నారంట. ఈ బంగారు మంగళ సూత్రాలను తయారు చేసేవారు.. తప్పనిసరిగా ఉపవాసం ఉండి.. దేవీ పూజలు చేశాక మాత్రమే.. మంగళసూత్రం తయారు చేయాలని చెప్పారంట.  

అంతే కాకుండా.. పెళ్లి రోజు కూడా కొన్ని నియమ నిష్టలతో  శోభిత, చైతులతో పూజలు చేసిన తర్వాతే..  ఆ మంగళసూత్రాన్ని చైతు.. శోభితా మెడలో కట్టేలా కూడా ప్లాన్ లు చేస్తున్నారని తెలుస్తొంది. అంటే పెళ్లి తర్వాత ఎలాంటి మాంగళ్య దోషాలు లేకుండా.. ఈ విధంగా కొన్నినియమాలు కఠినంగా పాటిస్తున్నట్లు తెలుస్తొంది.  

 ఈ క్రమంలో గతంలో డైవర్స్ జరిగింది.. కాబట్టి వీరు ఇలా భక్తితో..దేవుడి ఆశీస్సుల కోసం.. జాగ్రత్తలు తీసుకొవడంలో తప్పులేదని కొంత మంది అక్కినేని కుటుంబానికి సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం.. ఇది టూమచ్ అంటూ కూడా ట్రోల్స్ చేస్తున్నారంట...

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link