Naga Chaitanya Wedding Date:నాగచైతన్య - శోభిత పెళ్లి డేట్ ఫిక్స్.. సంతోషంలో. ఫ్యాన్స్..!
ఎట్టకేలకు నాగచైతన్య శోభిత మెడలో మూడు ముళ్ళు వేసే సమయం ఆసన్నమైంది. 2021లో తన మొదటి భార్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత మరుసటి ఏడాది అనగా 2022లో నాగచైతన్య శోభిత దూళిపాళతో ప్రేమాయణం మొదలుపెట్టారు.
వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు లండన్ లోని ఒక హోటల్ లో వీరిద్దరూ డిన్నర్ డేట్ కి వెళ్లినట్టు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. ఈ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినా.. ఈ విషయాలపై స్పందించే ప్రయత్నం చేయలేదు ఈ జంట.దీనికి తోడు శోభిత వల్లే నాగచైతన్య సమంతను వదిలేసాడంటూ వార్తలు వచ్చినా.. వాటిని కొట్టి పారేసే ఉన్న ప్రయత్నం చేయలేదు
ఇక ఎట్టకేలకు ఈ ఏడాది ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు ఈ జంట. ఇటీవల శోభిత కూడా తన ఇంస్టాగ్రామ్ ద్వారా వైజాగ్ లో ఉండే తన నివాసంలో పసుపు దంచడం, గోధుమ రాయి కార్యక్రమాలు..మొదలు పెట్టినట్లు ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
ఈ మేరకు పెళ్లి పనులు కూడా మొదలయ్యాయని అందరూ అనుకున్నారు. కానీ అటు అక్కినేని కుటుంబం నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. కానీ తాజాగా డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరగబోతోంది అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది . మరి అది డెస్టినేషన్ వెడ్డింగా..? లేక హైదరాబాదులో జరగబోతోందా అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు.
మొత్తానికి అయితే డిసెంబర్ 4 నాగచైతన్య - శోభిత వివాహం అంటూ వస్తున్న వార్తలు నిజం అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.