Samantha: నాగచైతన్య ఎప్పుడు అమ్మాయిలు చుట్టూ తిరిగేవాడు.. సమంత సెన్సేషనల్ కామెంట్స్
ఏం మాయ చేసావే సినిమాతో నిజంగానే తెలుగు ప్రేక్షకులను మాయ చేసారు.. నాగచైతన్య, సమంత జంట. ఆ సినిమాలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ గా కనిపించిన ఇద్దరు.. ఆ తరువాత కూడా తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు.
ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మనం, మజిలీ సినిమాలు కూడా సూపర్ సక్సెస్ సాధించాయి. ఇక స్క్రీన్ పైనే కాకుండా స్క్రీన్ బయట కూడా వీరిద్దరూ పెళ్లి చేసుకొని అభిమానులను ఖుషి చేశారు. అయితే ఈ ఆనందం అభిమానులకు.. ఎక్కువ రోజులు మిగలలేదు.
పెళ్లి చేసుకున్న మూడు సంవత్సరాలకి.. వీరిద్దరి మధ్య కొన్ని భేదాభిప్రాయాలు రావడం వల్ల.. ఇద్దరు విడిపోయారు. కారణాలు తెలియకపోయినా.. కొంతమంది మాత్రం అప్పట్లో నాగచైతన్య.. శోభితతో ప్రేమలో పడటం వల్లే సమంత వదిలేసింది అని వ్యాఖ్యలు చేశారు.
ఇక ఈ మధ్య.. అది నిజమే ఏమో అనేలా.. నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమంత గతంలో నాగచైతన్య గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
సమంత స్నేహితుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా చీ.ల.సౌ. ఈ సినిమాలో అక్కినేని కాంపౌండ్ హీరో సుశాంత్ హీరోగా నటించారు. ఈ చిత్రంకి సంబంధించిన ఈవెంట్ కి సమంత, నాగచైతన్య అటెండ్ కాగా.. రాహుల్ రవీంద్రన్ వీరిద్దరిలో ఎవరు ప్రేమించారు అని ప్రశ్నా అడిగారు. దానికి సమాధానంగా సమంత..’నేను ముందు నుంచే తననే చూస్తున్నాను. కానీ అతను మాత్రం అమ్మాయిల చుట్టూ తిరగడంలో బిజీగా ఉన్నారు. అందుకే నా దగ్గరికి వచ్చే లోపల.. అతనికి ఏడు సంవత్సరాలు పట్టింది ‘ అంటూ కామెంట్స్ చేసింది.
ఇక సమంత చేసిన ఈ వ్యాఖ్యలను ప్రస్తుతం ఆమె అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. నాగచైతన్య కి ముందు నుంచే ఇలా అమ్మాయిల చెట్టు తిరిగే బుద్ధి ఉంది అని ట్రోల్ వేస్తున్నారు.