Krithi Shetty Pics: లెహంగాలో కృతి శెట్టి.. సెగలు పుట్టిస్తున్న బేబమ్మ అందాలు!
కృతి శెట్టి తాజాగా లెహంగాలో మెరిసిపోయారు. స్లీవ్ లెస్ బ్లౌజ్, లూస్ హెయిర్‌లో బేబమ్మ చాలా అందంగా ఉన్నారు. కృతి తాజా ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కృతి శెట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్లతో అభిమానులను అలరిస్తున్నారు. ఆమె పెట్టే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
తాజాగా కస్టడీ సినిమా ద్వారా కృతి శెట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో కృతి కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం ఆమె మరో రెండు సినిమాలలో నటిస్తున్నారు.
ఉప్పెన సినిమా ఇచ్చిన పాపులారిటీతో కృతి శెట్టికి వరుస ఆఫర్లు వచ్చాయి. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ది వారియర్, 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో బేబమ్మ నటించారు.
హిందీ చలనచిత్రం సూపర్ 30లో కృతి శెట్టి నటించారు. 'ఉప్పెన' సినిమాతో కృతి తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతో పెద్ద స్టార్ అయిపోయారు.
2003 సెప్టెంబర్ 21న ముంబైలో కృతి శెట్టి జన్మించారు. కృతి కర్నాటకలోని మంగళూరుకు చెందిన తుళు కుటుంబంకు చెందినది. ప్రస్తుతం ఆమె డిగ్రీ చదువుతున్నారు.